సమంత ముఖ్య పాత్రలో గుణ శేఖర్ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన శాకుంతలం సినిమా విడుదలకు సన్నద్ధం అయింది.. వచ్చే నెల 17వ తారీకున విడుదల కాబోతున్న ఈ సినిమా పై అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయని తెలుస్తుంది..

అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుంది అనడంలో సందేహం అయితే లేదు అంటూ మేకర్స్ ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ తో చెప్పుకొచ్చారు.. ఈ సినిమా ను దిల్ రాజు సమర్పిస్తున్నాడు.

ఆ కారణంగా కూడా అంచనాలు భారీగా ఉన్నాయి. మరి అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ఉంటుందా అనేది అయితే చూడాలి. ఇక ఈ సినిమా లో సమంత యొక్క లుక్ మరియు కథ గురించి ముఖ్యంగా చర్చ జరుగుతోంది. అంతే కాకుండా గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న సమంత కు ఇది కచ్చితంగా అత్యంత ముఖ్యమైన సినిమా. ఇటీవల విడుదల అయిన యశోద సినిమా తో సమంతకు పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది.

సమంత అనారోగ్యంతో ఒక్క రోజు ప్రమోషన్ లో పాల్గొన్నా కానీ మంచి కలెక్షన్స్ నమోదు అయ్యాయి. ఇక శాకుంతలం సినిమా పై ఇండస్ట్రీ వర్గాల్లో అంచనాలు భారీగా అయితే ఉన్నాయి. అందుకే తెలుగులో మాత్రమే కాకుండా ఇతర భాషల్లో కూడా శాకుంతలం సినిమాకు మంచి బిజినెస్ అయితే జరిగింది. ముఖ్యంగా హిందీ డబ్బింగ్ రైట్స్ ఏకంగా 20 కోట్ల రూపాయలకు అమ్ముడు పోయాయి అంటూ ప్రచారం అయితే జరుగుతోంది. అదే కనుక నిజం అయితే చాలా గొప్ప విషయం. మొత్తం ఇతర భాషల డబ్బింగ్ రైట్స్ తో నిర్మాతలకు 50 కోట్ల వరకు వచ్చాయని తెలుస్తుంది.ఇక సినిమా విడుదల అయ్యి భారీ విజయాన్ని సొంతం చేసుకుంటే ఆ 50 కోట్లు కాస్త వంద కోట్లు అయినా కూడా ఆశ్చర్యం లేదు. హీరోయిన్ గా సమంత గతంలో ఎన్నో సినిమా ల్లో అయితే నటించింది. కనుక ఈ సినిమా మరింతగా ఆమెకు విజయాన్ని తెచ్చి పెడుతుందో లేదో చూడాలి. వంద కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తున్న శాకుంతలం సినిమా ఫలితం ఏవిధంగా ఉంటుందో మరి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: