సినిమా ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ ని ప్రారంభించి ఇక ఆ తర్వాత హీరోయిన్గా అవతారమెత్తి తనకంటే సీనియర్ హీరోలతో.. ఇక తనకంటే జూనియర్స్ తో కూడా నటించి అందరికీ పర్ఫెక్ట్ జోడి అనే పేరు సంపాదించుకుంది శ్రీదేవి. అంతే కాదు ఇక సినీ ప్రేక్షకులందరికీ కూడా అతిలోకసుందరిగా మారిపోయింది అని చెప్పాలి. అయితే భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల్లో కూడా స్టార్ హీరోయిన్గా హవా నడిపించిన శ్రీదేవి అప్పట్లో హీరోలకు మించిన రెమ్యూనరేషన్ తీసుకుని వార్తల్లో నిలిచింది అని చెప్పాలి. సినిమా ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన తర్వాత అటు ఎన్టీఆర్ కి కూతురు పాత్రలో నటించింది.


 అయితే ఆ తర్వాత కొన్నేళ్లకే అదే ఎన్టీఆర్ తో ఏకంగా హీరోయిన్గా నటించి రొమాన్స్ చేయడం కూడా అటు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారిపోయింది అని చెప్పాలి. ఇక తనకంటే వయసులో దాదాపు 30 ఏళ్లు పెద్దవాళ్లయిన ఎన్టీఆర్ ఏఎన్నార్ తో అప్పట్లో వరుస సినిమాలో నటించి సూపర్ హిట్ లు ఖాతాలో వేసుకుంది అని చెప్పాలి. ఆ తర్వాత కాలంలో వారి వారసులుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన బాలకృష్ణ నాగార్జున సరసన కూడా నటించి పర్ఫెక్ట్ జోడిగా పేరు సంపాదించుకుంది. అయితే ఇలా అప్పట్లో ఎన్టీఆర్ ఏఎన్నార్లకు సరితూగే హీరోయిన్ గా పేరు సంపాదించుకున్న శ్రీదేవి ఇద్దరినీ విభిన్న రీతిలో పిలుస్తూ ఉండేదట.


 బొబ్బిలి పులి సినిమాలో ఒకప్పుడు అన్నగారి సరసన కుమార్తెగా నటించినా శ్రీదేవి ఇక హీరోయిన్గా నటించింది. దాసరి నారాయణరావు కారణంగానే ఈ సినిమాను ఒప్పుకుంది. ఇక తర్వాత ఈ సినిమా హిట్ కావడంతో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది ఈ జోడి. అయితే శ్రీదేవి అన్నగారిని అంకుల్ అని పిలిచేదట. ఎన్టీఆర్ కూడా శ్రీదేవి అలా పిలిచిన పెద్దగా పట్టించుకునే వారు కాదట. అయితే అటు ఏఎన్ఆర్ ను మాత్రం సార్ అంటూ పిలిచేదట శ్రీదేవి. అందుకు కారణం ఎన్టీఆర్ కాస్త లావుగా ఉండి గంభీరంగా కనిపించడం.. ఇక ఏఎన్ఆర్ డైట్ చేస్తూ చూడటానికి ఎంతో సన్నగా స్లిమ్ గా ఉండడమేనట. అంతేకాకుండా ఏఎన్ఆర్  తో శ్రీదేవి అంత చనువుగా ఉండేది కాదట. కేవలం సినిమాల వరకు మాత్రమే మాట్లాడుకునేవారట.  కానీ ఇక అటు ఎన్టీఆర్ తో మాత్రం ఎంతో చనువుగా ఉండడం వల్లే ఇక అంకుల్ అని పిలిచేదట శ్రీదేవి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Anr