తెలుగు చిత్ర పరిశ్రమలో హీరోయిన్గా ఎనలేని గుర్తింపును సంపాదించుకున్న అంజలీదేవి గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేస్తే అది అతిశయోక్తి అవుతుంది అని చెప్పాలి. ఎంతో మంది స్టార్ హీరోల సినిమాల్లో నటించి తన నటనతో తన అభినయంతో ప్రేక్షకులను కట్టిపడేసి అభిమానులుగా మార్చుకుంది అంజలీదేవి. ముఖ్యంగా ఈమె నటించిన లవకుశ సినిమాలో అంజలీదేవి చేసిన సీత పాత్ర అయితే ప్రేక్షకుల గుండెలో చెరుగని ముద్ర వేసుకునేలా చేసింది అని చెప్పాలి. ఇక ఈ ఒక్క పాత్రతో అంజలీదేవి స్టార్ హీరోయిన్గా మారిపోయింది.


 తెలుగు ప్రేక్షకులు అందరూ కూడా ఆమెను నిజంగా సీతాదేవి అన్నట్లుగానే ఆరాధించేవారు అని చెప్పాలి. అయితే కేవలం హీరోయిన్గా మాత్రమే కాకుండా నిర్మాతగా కూడా మారి ఎన్నో సినిమాలను నిర్మించి నిర్మాణరంగంలో కూడా సక్సెస్ అయింది అని చెప్పాలి. ఇక ఇలా గొప్ప నటిగా ఎనలేని ఖ్యాతిని సంపాదించుకున్న అంజలీదేవి సంగీత దర్శకుడు ఆదినారాయణ రావు ను పెళ్లి చేసుకుంది. అయితే అలనాటి స్టార్ హీరోయిన్ కుటుంబం నుంచి వచ్చిన ఒక యువతి ప్రస్తుతం ఇండస్ట్రీలో హీరోయిన్గా కొనసాగుతుంది అన్న విషయం చాలామందికి తెలియదు.


 ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరో కాదు ఇండియన్ బ్యూటీ సినిమాలో హీరోయిన్గా చేసిన శైలా రావు. ఇక ప్రముఖ హీరోయిన్, నిర్మాత అయిన అంజలీదేవి మనవరాలు ఈ శైలరావు. సినిమాల మీద మీద ఉన్న పిచ్చితో చదువు పూర్తి చేయకుండానే యాక్టింగ్ లో శిక్షణ తీసుకుంది శైలరావు. ఇక తొలిసారిగా ఇండియన్ బ్యూటీ అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఆ తర్వాత ఆస్ట్రిచ్ పార్క్, టుడే స్పెషల్ లాంటి సినిమాలోనూ నటించింది. కానీ ఇక హీరోయిన్గా అవకాశాలు రాకపోవడంతో ఇక సొంతంగా రచనలు చేస్తూ నిర్మాతగా మరి కొన్ని సినిమాలను నిర్మిస్తుంది. ఇలా నాన్నమ్మ బాటలోనే హీరోయిన్గా నిర్మాతగా కూడా రాణిస్తుంది శైలరావు.

మరింత సమాచారం తెలుసుకోండి: