నటసింహ బాలకృష్ణ దాదాపు 40 సంవత్సరాలు తనదైన చిత్రాలతో సందడి చేస్తూ.. స్టార్ హీరోగా చలామణి అవుతున్నారు. కెరియర్ ఆరంభం నుంచి హిట్, ప్లాప్ లతో సంబంధం లేకుండా సినిమాలు చేస్తూ వస్తున్న ఈయన అఖండ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ ను సొంతం చేసుకొని.. ఇప్పుడు మరింత జోష్ తో సంక్రాంతికి గోపీచంద్ మలినేని దర్శకత్వంలో వీరసింహారెడ్డి సినిమాతో వచ్చారు. దీనికి కూడా భారీగా రెస్పాన్స్ వచ్చింది అని చెప్పవచ్చు. ఇకపోతే ఈ సినిమా అత్యధిక కలెక్షన్లను వసూలు చేయడంతో పాటు బాలకృష్ణకు మరో అరుదైన రికార్డును అందించింది.

తాజాగా ఈ సినిమా భారీ కలెక్షన్లు సాధిస్తూ దూసుకుపోతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ ఆదివారం హైదరాబాదులో "వీర సింహుని విజయోత్సవం" పేరిట ఒక సక్సెస్ మీట్ ను నిర్వహించారు. ఇందులో చిత్ర యూనిట్ సభ్యులతో పాటు చాలామంది దర్శకులు,  యంగ్ హీరోలు కూడా హాజరై సందడి చేశారు. ఈవెంట్ కి వచ్చిన అనిల్ రావిపూడి బాలయ్య 108వ సినిమాకు సంబంధించి మాట్లాడుతూ.. అదిరిపోయే స్పీచ్ ఇచ్చాడు.. అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. సాధారణంగా వింటర్ సీజన్.. రెయినీ సీజన్ నడుస్తుందని చెబుతూ ఉంటారు. కానీ ఇప్పుడు బాలయ్య సీజన్ నడుస్తోంది.  ఆయన వరుసగా బ్లాక్ బాస్టర్ కొట్టి ఊపులో ఉన్నారు అంటూ అనిల్ రావిపూడి అభిమానులలో జోష్ నింపారు.

ముఖ్యంగా ప్రతి సినిమాలో కూడా బాలయ్య టచ్ ఉంటుంది రేపు రాబోయే 108 సినిమాలో కూడా ఇదే ఉంటుంది.  ముఖ్యంగా ఈసారి రాయలసీమలో కాదు తెలంగాణలో దిగుతుండు.. బాక్స్ ఆఫీస్ ఊచకోత షురూ చేయబోతున్నాడు.. కలెక్షన్లతో ఖుర్బానీ పెడతాడు గెట్ రెడీ అంటూ తన సినిమా బ్యాక్ డ్రాప్ గురించి అనిల్ రావిపూడి లీక్ చేయడం ఇప్పుడు వైరల్ గా మారింది. మొత్తానికైతే ఈ విషయం తెలిసి బాలయ్య అభిమానులు తెగ సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా అనిల్ రావిపూడి డైరెక్షన్లో వస్తున్న సినిమా కోసం ఎదురుచూస్తున్నామంటూ కూడా కామెంట్లు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: