దాంట్లో భాగంగానే ఆమె తన లైఫ్ లో తాను చేసే ప్రతి పని మీదా ట్రోల్ల్స్ వస్తున్నాయి అని చెప్పిన రష్మిక తన తప్పేంటో చెబితే వినడానికి రెడీ గా ఉన్నానని చెప్పింది. వాళ్ళు చేసే కామెంట్స్ నాకు అర్ధం కావటంలేదని అవి ఏమైనా ఉంటే అర్థమయ్యేలా చెప్తే బాగుంటుందని అన్నది. ఆలా అర్ధం కాకుండా చేసే ట్రోల్ల్స్ తనను బాగా డిప్రెషన్ కి గురి చేస్తున్నాయని చెప్పింది.అలాగే ఆమెకు తరసపడిన ఇంకొక ప్రశ్న ఏంటంటే నేషనల్ క్రష్‌గా ఆడియన్సెస్ లో పేరు తెచ్చుకున్న మీ క్రేజ్ మరియు పాపులారిటీని ఎప్పుడైనా వదులుకోవాలని అనిపించిందా? అనే ప్రశ్నకు ఆమె కొన్నిసార్లు అలానే అనిపించిందని చెప్పింది. ఎందుకు అని అడగగా డానికి సమాధానంగా ఆమె ‘ఎందుకంటే జనాలకు నా బాడీతో కూడా సమస్యలు ఉన్నాయి. నేను ఎక్కువ వర్కవుట్ చేస్తే మగాడిలా కనిపిస్తున్నానంటారు. కొంచం లావు ఎక్కితే చాలా లావుగా ఉన్నానంటారు. అతిగా మాట్లాడితే నేను భయపడుతున్నానని, అస్సలు మాట్లాడకపోతే ‘యాటిట్యూడ్’ చూపిస్తున్నానని అని పేర్లు పెడతారు. నేను ఊపిరి తీసుకున్నా, తీసుకోకపోయినా వారికి పెద్ద ప్రాబ్లెమ్ అంటే నేనేం చేయాలి. ఈ రంగంలో ఉండాలా? వదిలేసి వెళ్లిపోవాలా’ అని రష్మిక తన బాధను వ్యక్తం చేసుకుంది.
ఐతే దీంట్లో భాగంగానే నా పైన ట్రోల్స్ చేసేవాళ్లు తనలో ఎలాంటి చేంజ్ ను కోరుకుంటున్నారో చెబితే వింటానని డానికి అనుగుణంగానే మార్చుకుంటానని రష్మిక చెప్పుకొచ్చారు. కానీ ఎలాంటి క్లారిటీ ఇవ్వకపోతే మాత్రం తానేం చేయలేనని తేల్చి చెప్పారు. ఏదైనా ప్రాబ్లెమ్ ఉంటే చెప్పాలి గానీ అసభ్య కరమైన పదజాలం వాడకూడదని చెప్పారు. ఇకపోతే, ఇళయదళపతి విజయ్ తో కలిసి చేసిన మూవీ ‘వారసుడు’తో సంక్రాంతికి హిట్ అందుకున్న రష్మిక ప్రస్తుతం ‘పుష్ప 2’లో నటిస్తోంది. ఈ సినిమా వైజాగ్‌లో ఇటీవల ఒక షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. ఐతే ఇందులో సీనియర్ నటుడు ఐనా జగపతి బాబు మాత్రం ఒక మెయిన్ రోల్ లో చేస్తున్నారని సమాచారం.