ప్రపంచంలో ప్రతి దర్శకుడికి, అలాగే ప్రతి యాక్టర్ కి, ప్రతి టెక్నిషియన్ కి ఉండే ఒక కల ‘ఆస్కార్’. ఈ ప్రెస్టీజియస్ అవార్డ్ ను గెలుచుకుంటే చరిత్రలో వారికంటూ ఒక పేజీ ఉంటుందని ప్రతి ఒక్కరూ ఫీల్ కూడా అవుతూ ఉంటారు.

ఫిల్మ్ ఇండస్ట్రీలోని ప్రతి కేటగిరికి టాప్ లెవల్ అవార్డ్ గా పరిగణించే ఆస్కార్స్ అవార్డ్ అనౌన్స్మెంట్ ఈసారి మార్చ్ 12న చెయ్యనున్నారని తెలుస్తుంది.. మార్చ్ 12న అవార్డ్ గెలవడానికి రేస్ లో ఎవరెవరు ఉన్నారు అనే విషయాన్ని ‘ఆస్కార్ ఫైనల్ నామినేషన్స్’ రూపంలో ఈరోజు అనౌన్స్ చెయ్యనున్నారని సమాచారం.ఇప్పటివరకూ బయటకి వచ్చిన ప్రిడిక్షన్స్ ని కనుక పక్కన పెడితే, ఈరోజు సాయంత్రం 7 గంటలకి ఆస్కార్ రేసులో ఎవరు ఉన్నారు? ఏ సినిమా ఉంది అనే విషయం అఫీషియల్ గా అయితే తెలియనుంది. ఈ అనౌన్స్మెంట్ లైవ్ స్ట్రీమింగ్ ని ‘oscars.org’, ‘abc.com’, ‘hulu tv’, ‘academy’కి సంబంధించిన అన్ని సోషల్ మీడియా అకౌంట్స్ లో కూడా లైవ్ స్ట్రీమింగ్ చూడొచ్చు.

95వ ఆస్కార్స్ పై ఈసారి ఎక్కువగా ఇండియన్స్ బాగా దృష్టి పెట్టారు. అందుకు కారణం తెలుగు సినిమా అయిన ఆర్ ఆర్ ఆర్ సినిమా రేసులో ఉండడమే. గోల్డెన్ గ్లోడ్ అవార్డ్ గెలుచుకోని ఆస్కార్ ఆశలని మరింత పెంచిన ఆర్ ఆర్ ఆర్ మూవీ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్ అవార్డ్ గెలుస్తుందని ప్రతి ఒక్కరూ కూడా నమ్ముతున్నారు. ఎన్టీఆర్ బెస్ట్ యాక్టర్ కేటగిరిలో మరియు ఆర్ ఆర్ ఆర్ బెస్ట్ మూవీ కేటగిరిలో ఆస్కార్ నామినేట్ అవుతుందని ప్రపంచ సినీ అభిమానులు కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఈ విషయంలో ఈరోజు సాయంత్రం క్లారిటీ అయితే రానుంది. బెస్ట్ మూవీ మరియు బెస్ట్ యాక్టర్ కేటగిరిల్లో అవార్డ్ రావడం కష్టమే కానీ ఒకవేళ నామినేట్ అయితే కనుక ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక కొత్త శకం మొదలయ్యినట్లే అని సమాచారం.03:40 PM

మరింత సమాచారం తెలుసుకోండి: