టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో టాలెంటెడ్ దర్శకుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు శివానిర్వాన. నిన్ను కోరి మరియు మజిలీ సినిమాతో తన టాలెంట్ ను ప్రూఫ్ చేసుకున్నాడు ఈ దర్శకుడు. ఈ రెండు సినిమాల అనంతరం నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కించిన టగ్ జగదీష్ సినిమా అనుకున్నంత స్థాయిలో విజయాన్ని అందుకోలేదు. దాని అనంతరం విజయ్ దేవరకొండ మరియు సమంత జంటగా ఒక ప్రేమ కథని తలకెక్కించాలని ఫిక్స్ అయ్యాడు శివ నిర్మాణ.ఖుషి అనే టైటిల్ తో ఒక సినిమాను తెరకెక్కించనున్నాడు శివ నిర్మాణ. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పూర్తయి చాలాకాలం అయింది. ఈ సినిమాకి సంబంధించిన మరికొంత షూటింగ్ ఇంకా కంప్లీట్ అవ్వాల్సి ఉంది.

 సమంత అనారోగ్యం కారణంగా ఈ సినిమాకి సంబంధించిన కొంత భాగం షూటింగ్ ఇంకా పూర్తి కాలేదు. ఏడాదిన్నర నుండి సమంత తన వ్యాధికి సంబంధించిన ట్రీట్మెంట్ కొరకు హాస్పిటల్ లోనే మెడికల్ ట్రీట్మెంట్ ను తీసుకుంటూ ఉంది. అయితే తాజాగా గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రలో నటించిన శకుంతలం సినిమా ఫిబ్రవరి 17న ప్రపంచవ్యాప్తంగా విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమాకి సంబంధించి విడుదలైన టీజర్ ఈవెంట్లో కూడా పాల్గొని సమంత పాల్గొన్నందుకు గాను సమంత అనారోగ్యం నుండి పూర్తిగా కోరుకుంది అని అందరూ భావించారు. ప్రస్తుతం సమంతా మునుపటి ఫిట్నెస్ కోసం ప్రయత్నం చేస్తుంది.

ఈ నేపథ్యంలోనే శకుంతలం సినిమా రిలీజ్ అయిన తర్వాత నుండి మార్చి మొదటి వారంలో శివనిర్వాన దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ను మళ్ళీ మొదలు పెట్టాలని భావిస్తున్నారు. ఇక ఈ విషయాన్ని సమంత కూడా కన్ఫర్మ్ చేసినట్లుగా సమాచారం. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఒక వేళా సమంత మార్చి మొదటి వారం నుండి ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్లో పాల్గొనకపోతే ఈ సినిమా డైరెక్టర్ శివ నిర్మాణ ఈ ప్రాజెక్టును పక్కనపెట్టి మరో ప్రాజెక్ట్ కి వెళ్లాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఈ డైరెక్టర్ ఒక మంచి ఇంట్రెస్టింగ్ స్టోరీ తో మెగా ఫ్యామిలీ హీరోతో ఒక సినిమా తీయాలని ఫిక్స్ అయినట్లుగా కూడా తెలుస్తోంది. ప్రస్తుతం వారి డేట్స్ కోసం ఎదురు చూస్తున్నాడు. మార్చి వరకు సమంత కోసం వెయిట్ చేసి ఈ సినిమాకి సంబంధించిన ఒక నిర్ణయం తీసుకోవాలని శివ నిర్మాణ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సమంత కూడా ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్లో త్వరగా జాయిన్ అవ్వాలి అని భావిస్తోందట. మరి దీనికి సమంత ఆరోగ్యం సహకరిస్తుందా లేదా అన్నది చూడాలి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: