టాలీవుడ్ టాలెంటెడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్దార్థ్ తన కెరీర్ ప్రారంభంలో మంచి హిట్ లు అందుకొని ఆ తర్వాత కొంతకాలం వరుసగా ఫ్లాప్ లతో సతమతమయ్యాడు.అయితే చాలా కాలం తర్వాత ‘స్వామి రారా’ సినిమాతో మంచి కమ్ బ్యాక్ హిట్ అందుకున్నాడు. ఇక అప్పటి నుంచి వరుసగా క్రేజీ ప్రాజెక్టులు చేస్తూ ప్రయోగాల హీరోగా చాలా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. గతేడాది ‘కార్తికేయ 2’ సినిమాతో అయితే పాన్ ఇండియా లెవెల్ లో సాలిడ్ హిట్ ను అందుకున్న ఈ యంగ్ హీరో ఇప్పుడు మరో పాన్ ఇండియా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.ఈసారి స్పై థ్రిల్లర్ కాన్సెప్ట్ తో ఆకట్టుకోవడానికి సిద్దమవుతున్నాడు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ ఫోటోను కూడా రిలీజ్ చేశాడు నిఖిల్. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతూ తెగ వైరల్ అవుతోంది.


ఇక నిఖిల్ విడుదల చేసిన పోస్టర్ ను చూస్తే.. అందులో నిఖిల్ గన్ పట్టుకుని సీరియస్ లుక్లో ఆకట్టుకుంటున్నాడు. చూస్తుంటే ఇది పక్కా స్పై థ్రిల్లర్ సినిమా అని తెలుస్తోంది. దీంతో పాటు నిఖిల్ తన ఇంస్టా లో ఇలా పేర్కొన్నాడు.. ‘‘ఇది అఫీషియల్ లీక్ ‘కార్తికేయ 2’ సినిమా తర్వాత మరో పాన్ ఇండియా సినిమాతో మీ ముందుకు వస్తున్నా. మల్టీ లాంగ్వేజ్ లో తెరకెక్కుతోన్న ఈ స్పై థ్రిల్లర్ సినిమా ఈ సమ్మర్ లో మీ ముందుకు రానుంది." అంటూ తెలిపాడు. దీంతో నిఖిల్ ఫ్యాన్స్ బాగా సంబరపడిపోతున్నారు. ఇలాంటి సినిమా కోసమే వెయిట్ చేస్తున్నాం అంటూ ఈ పోస్టుకి కామెంట్లు పెడుతున్నారు. ఈ సినిమాకి గ్యారీ బిహెచ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది ఆయన మొదటి సినిమా. ఇంతకు ముందు ‘గూఢచారి’, ‘ఎవరు’, ‘హిట్’, ‘పాగల్’, ‘హిట్ 2’ వంటి సూపర్ హిట్ సినిమాలకు ఎడిటర్ గా పనిచేశాడు గ్యారీ. దీంతో ఆయన డైరెక్ట్ చేస్తున్న సినిమా కావడంతో ఈ మూవీ పై  అంచనాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: