తెలుగు సినీ ప్రేక్షకులు బ్రహ్మీ అని ముద్దుగా పిలుచుకునే బ్రహ్మానందం గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఆయన తన కామెడీ టైమింగ్ తో నవ్వుల పువ్వులు పూయిస్తూ ప్రతి ఒక్కరికి మంచి వినోదాన్ని అందిస్తూ ఉంటారు. అందుకే బ్రహ్మానందం లేని సినిమా లేదంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా 2000 సంవత్సరం మధ్యకాలంలో బ్రహ్మానందం ప్రతి సినిమాకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచేవారు. తమ నటనతో కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించే ఈయన మరొకవైపు కోవై సరళ, హేమ , సురేఖ వంటి లేడీ కమెడియన్స్ తో కలిసి చేసే కామెడీకి ప్రేక్షకులు నీరాజనం పట్టారు.

దాదాపు చాలా సినిమాలు ఈయన కామెడీ తోనే హిట్ అయ్యాయి అనడంలో సందేహం లేదు. నవరసాలు పండించగల అద్భుత హాస్యనటుడు అని చెప్పవచ్చు.  రేలంగి,  పద్మనాభం వంటి గొప్ప హాస్యనటుల తర్వాత అంతటి స్థానాన్ని సంపాదించుకున్నారు బ్రహ్మానందం. అందుకే అందరూ ఆయనను చిన్న రేలంగి అని ముద్దుగా పిలుస్తూ ఉంటారు . బ్రహ్మానందం వయసుతో సంబంధం లేకుండా తనకు ఇచ్చిన పాత్రలో అద్భుతంగా నటించడమే కాదు తన ముఖంలో నవరసాలు పండిస్తూ ముఖ కవళికలతోనే నవ్వు తెప్పించేవారు. ఆయన కనిపిస్తే చాలు ప్రతి ఒక్కరిలో నవ్వు కనిపించేది. అంతలా నవ్వుల రారాజుగా చిరస్థాయిగా నిలిచిపోతారు బ్రహ్మానందం.

ప్రస్తుతం వయసు మీద పడడంతో గతంలో గుండెపోటు కూడా రావడం వల్ల ఆయన సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్నారనే చెప్పాలి. అప్పట్లో వరుస సినిమాలు చేసిన బ్రహ్మానందం ఇప్పుడు ఆచితూచి అడుగులు వేస్తూ ఒకటి రెండు సినిమాలకే పరిమితం అవుతున్నారు. మరొకవైపు తన మనవడు , మనవరాలు తో  కాలక్షేపం చేస్తూ తన వృద్యాప్య జీవితాన్ని కొనసాగిస్తున్నారని చెప్పాలి. ఏది ఏమైనా బ్రహ్మానందం లాంటి గొప్ప హాస్య సినీ నటుడు మళ్లీ సినిమాలలోకి రావాలి అని అభిమానులు కోరుకుంటున్నారు . అయితే ఆరోగ్యరీత్యా కూడా ఆలోచిస్తున్న విషయం తెలిసిందే. ఇంతటి గొప్ప నవ్వుల రారాజు బ్రహ్మానందంకు హెరాల్డ్ తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు.

మరింత సమాచారం తెలుసుకోండి:

HBD