తెలుగు సినీ ఇండస్ట్రీ లో తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పరచుకున్నారు నటుడు డైరెక్టర్ కళాతపస్వి కె.విశ్వనాథ్ గారు. ప్రస్తుతం ఈయన వయసు 92 సంవత్సరాలు కావడంతో పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఈయన నిన్నటి రోజున హైదరాబాదులోని ఒక ప్రముఖ హాస్పిటల్ లో చికిత్స కోసం చేర్పించగా.. నిన్నటి రోజున రాత్రి ఈయన మరణించినట్లుగా తెలుస్తోంది. ఈయన దర్శకుడుగానే కాకుండా నటుడుగా కూడా తెలుగు సినీ చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేకమైన పేజీలను ఏర్పరచుకున్నారు


విశ్వనాథ్ గారి పూర్తి పేరు కాశీనాధుని విశ్వనాథ్.. ఈయన గుంటూరు జిల్లా రేపల్లెలో 1930 ఫిబ్రవరి 19న జన్మించారు. ఇక ఈయన విద్యాభ్యాసం మొత్తం అక్కడే హిందూ కాలేజీలో చదివారట. మొదట వారాహి స్టూడియోలో సౌండ్ ఆర్టిస్టుగా తన కెరీర్ ను మొదలుపెట్టిన ఈయన టాలెంట్ను నాగేశ్వరరావు గారు గుర్తించి ఆత్మగౌరవం అనే సినిమాతో డైరెక్టర్ గా అవకాశాన్ని కల్పించారు. ఆ తర్వాత ఈయన కెరియర్లో మలుపు తిప్పిన చిత్రం సిరిసిరిమువ్వ దీంతో ఈయన ప్రతిభ బయటికి వచ్చిందని చెప్పవచ్చు ఇలా ఎన్నో అద్భుతమైన చిత్రాలను తెలుగు తెరకు అందించారు విశ్వనాథ్ గారు.

తెలుగు చిత్ర పరిశ్రమకు ఇంతటి గుర్తింపు తెచ్చిన విశ్వనాథ్ 50కుపైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. భారతీయ సంస్కృతికి చిహ్నమైన శాస్త్రీయ కళలను కథలుగా ఎన్నో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించారు ఈయన. జాతీయ పురస్కారం గెలుచుకొని తెలుగు సినీ పరిశ్రమలోనే ఒక చరిత్రను సృష్టించారు. ఈయన కెరియర్లు స్వాతిముత్యం స్వయంకృషి శుభలేఖ తదితర చిత్రాలు అందర్నీ ఆలోచింపజేసేలా కనిపిస్తూ ఉంటాయి. 2016లో ఈయన దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం అందుకున్నారు.. 1992లో రఘుపతి వెంకయ్య పురస్కారంతోపాటు పద్మశ్రీ అవార్డును కూడా అందుకోవడం జరిగింది. కె విశ్వనాథ్ గారి మృతి పట్ల పలువురు సినీ సెలబ్రిటీలతోపాటు ఈయన అభిమానులు కూడా ఈయన మృతికి సంతాపాన్ని తెలియజేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: