మొదట సౌండ్ రికార్డిస్టుగా తన సినీ కెరీర్ అని ప్రారంభించిన నటుడు ,డైరెక్టర్ విశ్వనాథ్ అంటే తెలియని వారంటూ ఎవరు ఉండరు. తన మొదటి చిత్రంతోనే రాష్ట్ర ప్రభుత్వం అందించిన నంది అవార్డును గెలుచుకున్నారు. ఈయనకు రచయిత్రి మద్దెనపూడి సులోచన రాణి కథను సమర్పుడిగా అందించి గొల్లపూడి కలిసి మాటలు అందించారు. సిరిసిరిమువ్వ సినిమాతో ఈయన ప్రతిభ వెలుగులోకి వచ్చింది.. అలాంటి ప్రతిభతో దాదాపుగా 50కు పైగా సినిమాలను దర్శకత్వం వహించారు.


సోమయాజులతో ఆయన తెరకెక్కించిన శంకరాభరణం చిత్రం ఇప్పటికీ కల్ట్ క్లాసిగల్ గా పేరు తెచ్చుకుందని చెప్పవచ్చు. ఈయన కలం నుంచి ఎన్నో అద్భుతమైన చిత్రాలు పాత్రలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దర్శకుడుగా విశ్వనాథ్ స్థానం ప్రత్యేకమని చెప్పవచ్చు. డైరెక్టర్ విశ్వనాథ్ మెగా ఫోన్ పట్టారంటే కచ్చితంగా ఖాకీ దుస్తులను ధరిస్తూ ఉంటారట. ఈ విషయం గురించి గతంలో ఒక ఇంటర్వ్యూలో తెలియజేశారట. సెట్లో ఖాకీ యూనిఫామ్ ధరించడానికి ముఖ్య కారణం తెలియజేశారు. సౌండ్ ఇంజనీరుగా ఉండి డైరెక్టర్ గా మారాను..


ఎమ్మెల్యే అయిన వారు మంత్రి కావాలనుకుంటారు మంత్రి అయిన వారు ముఖ్యమంత్రి కావాలనుకుంటారు సినిమాలలో అయితే ఏ విభాగంలో అడుగుపెట్టిన.. చివరిగా దర్శకుడు కూర్చునే కుర్చీ దక్కిందంటే ప్రతి ఒక్కరి కళ్ళు నెత్తికెక్కి ప్రమాదం ఉంటుంది. దర్శకుడుగా ఎదిగిన నాకు ఎలాంటి గర్వం తలకు ఎక్కకూడదని సాటి కార్మికులతో కలిసి నేను కూడా ఒక్కడిని అనేంతలో ఈ దుస్తులు నాకు గుర్తు చేస్తాయని అందుచేతనే ఈ ఖాకీ చొక్కా తన సినిమా సెట్ లో ధరిస్తానని తనతో పాటు తన సెట్ లో పనిచేసే పెయింటర్స్, లైట్స్ బాయ్, హెల్పర్ అందరికీ కూడా ఇలాంటి దుస్తులే ఉంటాయని తెలియజేసినట్లు తెలుస్తోంది. తను మొదటి నుంచే ఇలాంటి దుస్తులను ధరిస్తానని తెలియజేశారు. ప్రస్తుతం ఈ విషయం వైరల్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: