టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో లేడీస్ సూపర్ స్టార్ మరియు నాచురల్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది సాయి పల్లవి. ఫిదా సినిమాతో హీరోయిన్ ఇండస్ట్రీకి పరిచయమైన ఈమె తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. సాయి పల్లవి కి చాలామంది ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. హీరోయిన్ గా కంటే వ్యక్తిగతంగా తనను చాలామంది ఇష్టపడుతూ ఉంటారు. తన మాటకి మరియు తన డ్రెస్సింగ్ స్టైల్ కి ఎంతోమంది అభిమానులు ఉన్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇదిలా ఉంటే ఇక ఈ నాచురల్ బ్యూటీ ఇప్పుడు సినిమాలు చేస్తుందా లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

ఏడాదికి కనీసం నాలుగు నుండి ఐదు సినిమాలు చేస్తూ బిజీగా ఉండాల్సిన సాయి పల్లవి ప్రస్తుతం ఒక్క సినిమా కూడా చేయడం లేదు. దీంతో సాయి పల్లవి అభిమానులు అసలు సాయి పల్లవి సినిమాలు చేస్తుందా లేదా అన్న తరుణంలో ఆలోచిస్తున్నారు. ప్రస్తుతం సాయి పల్లవి ఏమి దగ్గరికి కదా చెప్పడానికి వెళ్లే దర్శక నిర్మాతలకు అందరికీ కూడా నో చెబుతామని సమాచారం. అయితే ఈ నేపథ్యంలోనే తన దగ్గరికి వెళ్లిన నిర్మాతలు అందరికీ కూడా సాయి పల్లవి నో చెప్పడంతో ఏ ఒక్క నిర్మాత కూడా సాయి పల్లవి దగ్గరికి సంప్రదించడానికి ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది.

అయితే సాయి పల్లవిని కొందరు స్టార్ హీరోల సినిమాల కోసం సంప్రదించడానికి ప్రముఖ దర్శక నిర్మాతలు ఆమె దగ్గరికి వెళ్లారట. వెళ్లి ఆమెని సంప్రదించినప్పటికీ ఏ ఒక్క దర్శక నిర్మాతకి కూడా సాయి పల్లవి ఓకే చేయలేదట. ఈ నేపథ్యంలోనే సాయి పల్లవి సినిమాలకు నో చెబుతోంది అని తెలుసుకున్నారు. చాలామంది నిర్మాతలు సాయి పల్లవిని సంప్రదించడం లేదట. అంతేకాదు ఈ సినిమాలో కూడా ఆమెని తీసుకోవడానికి దర్శక నిర్మాతలు ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. సాధారణంగా సాయిపల్లవి ని లేడీ పవర్ స్టార్ అంటూ తమ అభిమానులు పిలుస్తూ ఉంటారు. ఇక అంతటి అభిమానాన్ని సొంతం చేసుకున్న సాయి పల్లవి సినిమాలు చేయకపోవడంతో నిరాశ పడుతున్నారు ఆమె అభిమానులు. ఇప్పటికైనా తెలుగులో సాయి పల్లవి సినిమాలు చేస్తే బాగుంటుందని తమ ఆశ భావాన్ని సోషల్ మీడియా వేదికగా వ్యక్తి పరుస్తున్నారు సాయి పల్లవి అభిమానులు..!!.

మరింత సమాచారం తెలుసుకోండి: