ప్రేక్షకుల అభిరుచి ఓటర్ల తీర్పు ఎప్పుడు ఎలా ఉంటుందో తలలు పండిన వారికి కూడ అంచనాలకు దొరకదు. ‘జాతిరత్నాలు’ ‘డిజే టిల్లూ’ ఆమూవీ నిర్మాతలకు కనకవర్షం కురిపించడంతో డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన చిన్న సినిమాలను ప్రేక్షకులు బాగా ఇష్టపడుతున్నారు అన్న అభిప్రాయంతో ప్రముఖ నిర్మాణ సంస్థలు అన్నీ వరసపెట్టి చిన్న సినిమాలను తీయడం మొదలుపెట్టడమే కాకుండా ఆచిన్న సినిమాల పై భారీ అంచనాలు పెట్టుకున్నాయి.


అయితే ఈవారం విడుదలైన మూడు చిన్న సినిమాల ఫలితాన్ని విశ్లేషణ చేస్తే మళ్ళీ చిన్నసినిమాల పై ప్రేక్షకులకు చిన్నచూపు ఏర్పడిందా అన్న సందేహాలు ఇండస్ట్రీ వర్గాలకు వస్తున్నాయి. ఈవారం విడుదలైన ‘రైటర్ పద్మభూషణ్’ మూవీకి విమర్శకుల నుండి మంచి ప్రశంసలు లభించడమే కాకుండా ఈ మూవీని చూసినవారు ఈ మూవీ బాగుంది అంటూ పాజిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నారు.


సితారా ఎంటర్టైన్మెంట్ సంస్థ నుండి వచ్చిన ‘బుట్టబొమ్మ’ మూవీకి కూడ మంచి టాక్ వచ్చింది. ఇక యాక్షన్ మూవీగా వచ్చిన ‘మైఖేల్’ మూవీకి డివైడ్ టాక్ వచ్చింది. అయితే ఈ మూడు సినిమాలకు కనీసపు ఓపెనింగ్ కలక్షన్స్ కూడ రాకపోవడంతో పాటు ఈ సినిమాలకు వీకెండ్ కలక్షన్స్ కూడ అంతంతమాత్రంగా ఉండటంతో మళ్ళీ సగటు ప్రేక్షకుడు చిన్న సినిమాలను దూరం పెడుతున్నాడా అన్న సందేహాలు ఇండస్ట్రీ వర్గాలకు వస్తున్నాయి.


డిసెంబర్ నెలలో వచ్చిన ‘ధమాకా’ సంక్రాంతికి వచ్చిన ‘వాల్తేర్ వీరయ్య’ ‘వీరసింహా రెడ్డి’ సినిమాలకు డివైడ్ టాక్ వచ్చినప్పటికీ ఆమూడు సినిమాలు వందల కోట్లు కలెక్ట్ చేయడంతో మళ్ళీ ప్రేక్షకులు మాస్ సినిమాల వైపు అదేవిధంగా ఏమాత్రం వాస్తవిక దృష్టిలేని కథల వైపు అడుగులు వేస్తున్నారా అన్న సందేహాలు చాలామందికి కలుగుతున్నాయి. బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ నటించిన ‘పఠాన్’ కు తెలుగు రాష్ట్రాలలో కూడ వచ్చిన భారీ కలక్షన్స్ ను పరిశీలిస్తున్నవారికి మళ్ళీ ప్రేక్షకులు చిన్న సినిమాలను చూడటం పూర్తిగా తగ్గించివేసారు అన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి..




మరింత సమాచారం తెలుసుకోండి: