టాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలుగుతున్న వారిలో హీరోయిన్ సమంత కూడా ఒకరు. ఎంతోమంది హీరోయిన్స్ సినిమాలలోనే కాకుండా పలు రకాల యాడ్స్లలో కూడా నటిస్తూ బాగానే సంపాదిస్తూ ఉంటారు. ఇలాగే కాకుండా పలు రకాల బిజినెస్లో పెట్టుబడులు పెట్టి బాగా సంపాదిస్తూ ఉంటారు. అలా తమ కెరీయర్ని మాత్రం ముందుకు తీసుకు వెళ్తూ ఉంటారు హీరోయిన్స్. ఇప్పుడు తాజాగా సమంత మరొక బ్రాండ్ కు అంబాసిడర్ గా మారినట్లు తెలుస్తోంది వాటి గురించి తెలుసుకుందాం.


సమంత గతంలో వస్త్రధారణలో, జువెలరీ కి సంబంధించి, కూల్ డ్రింక్ ఇతరత్న వాటికి సంబంధించి బ్రాండ్ గా వ్యవహరిస్తూ ఉండేది ఇప్పుడు తాజాగా విక్స్ కంపెనీకి చెందిన వాటికి కూడా సమంత కొత్తగా బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తుందని తెలుస్తోంది.అందుకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. సమంత ఒకవైపు సినిమాలలో మరొకవైపు కమర్షియల్ యార్లలో నటిస్తూ బిజీగా ఉంటోంది. అంతేకాకుండా కొన్ని సేవా సంస్థలకు కూడా స్వచ్ఛందంగా విరాళాలు ఇస్తూనే తాను కూడా ఒక స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసింది. ఇలా తన వంతు సహాయంగా కొంత మొత్తం అందుకు ఇస్తూ ఉంటుంది సమంత.


ప్రస్తుతం సమంత నటించిన  శాకుంతలం సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా పోస్టర్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సమంత మయోసైటీస్ వ్యాధిన పడ్డ సంగతి అందరికీ తెలిసిందే ఈ వ్యాధి నుంచి కోరుకున్న వెంటనే ఈమె కొన్ని ఆలయాలను సందర్శించి మొక్కులు తీర్చుకోవడం జరిగింది. తాజాగా సమంత ఫోటోలు చూసినా అభిమానులు అందరూ ఆశ్చర్యపోతున్నారు.సమంత అప్పటికి ఇప్పటికీ అంతే అందంగా కనిపిస్తోందని పలు రకాలుగా కామెంట్ చేస్తున్నారు. అయితే సమంత రెండో వివాహం చేసుకోమని వార్తలు కూడా వినిపించాయి కానీ ఇందులో ఎలాంటి నిజం లేదని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: