పాన్ ఇండియా స్టార్  ప్రభాస్ నటించిన ఆదిపురుష్ మూవీ విడుదల కావడాని కి మరో నాలుగు వారాల సమయం ఉంది. ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించనున్నారట..

ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ ఆదిపురుష్ సినిమా గురించి మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను ఆయన వెల్లడించారు. సినిమా ఇండస్ట్రీ లో ఉండటం సంతోషాన్ని కలిగించే విషయమ ని ఆదిపురుష్ సినిమా నన్ను చాలా భయపెట్టిందని ఆయన తెలిపారు.

ఆదిపురుష్ హిందీ వెర్షన్ హీరో పాత్రకు శరద్ కేల్కర్ డబ్బింగ్ చెప్పారట.. నేను డబ్బింగ్ చెప్పడంలో భాగంగా ఆదిపురుష్ చూశానని ఆయన చెప్పుకొచ్చారు. ఆదిపురుష్ మూవీ చాలా బాగుందని సినిమా తుది మెరుగులు దిద్దిన తర్వాత మరింత బాగుంటుందని శరద్ కేల్కర్ చెప్పుకొచ్చారట  

ఆదిపురుష్ కంటెంట్, ఈ సినిమాను తెరకెక్కించిన విధానం బాగుందని కూడా ఆయన కామెంట్లు చేశారు. ఆదిపురుష్ డబ్బింగ్ పూర్తైన తర్వాత ప్రభాస్ ను కలవగా ఆయన ఆప్యాయంగా హత్తుకున్నారని శరద్ కేల్కర్ వెల్లడించారట.. డబ్బింగ్ చాలా బాగా చెప్పావని ప్రభాస్ ప్రశంసించారని ఆయన పేర్కొన్నారు. ప్రభాస్ నుంచి దక్కిన ప్రశంస ను అతిపెద్ద ప్రశంసగా భావిస్తానని కూడా శరద్ కేల్కర్ పేర్కొన్నారు.

ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్నాయట.. 600 నుంచి 700 కోట్ల రూపాయల బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కిందని తెలుస్తుంది.ఆదిపురుష్ సినిమా ప్రభాస్ కు కెరీర్ బిగ్గెస్ట్ ను అందిస్తుందేమో అయితే చూడాలి. సాహో, రాధేశ్యామ్ ప్రేక్షకుల ను బాగా నిరాశ పరిచాయి. ఆదిపురుష్ మాత్రం అంచనాలను మించి సక్సెస్ కావాలని  ఫ్యాన్స్ కూడా భావిస్తున్నారు ఆదిపురుష్ సినిమా లో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయని తెలుస్తోంది. ఈ సినిమా నుంచి త్వరలో మరిన్ని షాకింగ్ అప్ డేట్స్ అయితే రానున్నాయని తెలుస్తుంది.. శరద్ కేల్కర్ వెల్లడించిన విషయాలు ప్రస్తుతం సోషల్ మీడియా లో బాగా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: