ఏ మనిషి ఎదుగదలకు అయినా భావనా శక్తి ఎంతో అవసరం. భావనా శక్తిని ఉపయోగించు కోకుండా ఏవ్యక్తి తాను ఎంచుకున్న రంగంలో అంతకంటే ముఖ్యంగా వ్యాపార రంగంలో రాణించలేడు. ఒక వ్యక్తి ఏదైనా తయారు చేయాలి అన్నా లేదా ఏదైనా నిర్మించాలి అన్నా ముందుగా తన భావనా శక్తిని ఉపయోగించి తన మనసులో తన ఆలోచనలను దర్శించు కోగల వ్యక్తి మాత్రమే విజయాలను అందుకుని ఆపై సంపదను పొందగలుగుతాడు. 


అందుకే అనేక రంగాలలో విజయాన్ని సాధించిన ఎందరో ప్రముఖులు తమ విజయాలను గురించి మాట్లాడుతూ తమ ఆలోచనలలో పుట్టిన విషయానికి తమ కృషి తోడు అవ్వడం వలన మాత్రమే తాము విజయాన్ని సాధించామని అంటూ ఉంటారు. అంతేకాదు భావనా శక్తి లేని వ్యక్తికి అదృష్టం అవకాశాలు ఉన్నా విజయం సాధించలేరు. 


ఆత్మ విశ్వాసం నాయకత్వ లక్షణాలు మంచి చదువు ఇలా ఎన్ని లక్షణాలు ఉన్నా భావనా శక్తి లేకపోతే ఈ లక్షణాలు రాణించవు. అందుకే ఆలోచనలు అనేవి మానవుని మేధస్సులో పుట్టి లాభదాయకమైన ఉత్పత్తులు అంటూ ప్రపంచ విఖ్యాత ఐటి దిగ్గజం బిల్ గేట్స్ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అంతేకాదు ఇంట్లో ఉన్న చెత్తను అమ్మి సొమ్ము చేసుకోవాలి అనే ఆలోచన కూడ వ్యాపార ధృక్పదమే అంటూ ప్రముఖ వ్యాపార వేత్త క్లారెన్స్ సాండర్స్ తన స్వీయ చరిత్రలో అభిప్రాయ పడ్డారు. 


మనకు ఆలోచనా శక్తి ఉన్నప్పుడు మాత్రమే మన ప్రోడక్ట్ కు ఎంత మార్కెట్ వస్తుంది ఆ మార్కెట్ ను ఎలా సృష్టించుకోవాలి అన్న ఆలోచనలు వస్తాయి. వాస్తవానికి ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి వ్యక్తికి ఎంతోకొంత ఆలోచనా శక్తి ఉంటుంది. అయితే ఆ ఆలోచనా శక్తి గురించి ఆలోచించడానికి చాలామంది ప్రాధాన్యత ఇవ్వరు. అందువల్లనే చాలామంది సామాన్యులుగానే మిగిలిపోతారు. మన వ్యాపార ప్రణాళిక గాని ఉద్యోగ లక్ష్యాలు కాని సక్రమంగా నేరవేరాలి అంటే ప్రతి వ్యక్తి తనలో అంతర్లీనంగా ఉన్న ఆలోచనా శక్తిని గుర్తించగలిగినప్పుడు మాత్రమే విజయాన్ని అందుకుని ఐశ్వర్యం పొందగలడు..  

మరింత సమాచారం తెలుసుకోండి: