నాయకత్వ లక్షణాలు లేకుండా ఏ వ్యక్తి అనుకున్న విజయం సాధించలేడు. ప్రతివ్యక్తి తన కనీస అవసరాల కోసం కష్టపడే విషయం నిజమే అయినా ఆ కనీస అవసరాలకు మించి ఆలోచనలు చేయడమే నాయకత్వ లక్షణం. ఒక వ్యక్తి తన సగటు అవసరాల గురించి కాకుండా చొరవతో తాను పనిచేసే సంస్థలో కానీ నిర్వహించే వ్యాపారంలో కాని మరింత రాణించడానికి చేసే ప్రయత్నాలే నాయకత్వ లక్షణాలు.


జీవితంలో ఒక వ్యక్తి తాను అనుకున్నది పొందాలి అంటే అతడి జీవితంలో ఎదురయ్యే ఆటంకాలకు బందీ కాకుండా బయటపడే సామర్ధ్యం ఉండాలి. ఆ సామర్ధ్యాన్ని ఒక వ్యక్తిలో ఉండే న్యాయకత్వ లక్షణాలు అతడికి కలిగిస్తాయి. అందుకే నాయకత్వం చొరవ అన్న పదాలు ఒకదానితో ఒకటి సంబంధం కలిగిన విషయాలుగా మనీ విశ్లేషకులు గుర్తిస్తూ ఉంటారు.


స్వతంత్రంగా ఆలోచించడం మన జీవన గమనానికి సంబంధించిన మార్గాన్ని ఎంచుకుని సామర్ధ్యం నాయకత్వ లక్షణాల వలనే ఏర్పడుతుంది. మరొక మాటగా చెప్పాలి అంటే మన జీవితంలో మనం ఏమి సాధించాలి అన్నఆలోచన రావాలి అంటే అది నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తికి మాత్రమే వస్తాయి. తమ ఆలోచనలు లక్ష్యాలు ఇతరులకు వివరించి చెప్పగలిగిన వ్యక్తికి మాత్రమే విజయం లభిస్తుంది.


అలా వివరించి చెప్పాలి అంటే అది కేవలం నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తికి మాత్రమే సాధ్యం అవుతుంది. కేవలం పాఠాలు అధ్యయనం చేసిన వ్యక్తికి నాయకత్వ లక్షణాలు ఏర్పడతాయి అని అనుకోవడం అవివేకం. ఇలా నాయకత్వ లక్షణాలు కలిగి ఉన్న వ్యక్తికి మాత్రమే ఆత్మవిశ్వాసం ఎక్కువగా ఉంటుంది. అంతేకాదు వారి నైపుణ్యాలు సృజనాత్మకత బయటకు వచ్చి వాటికి ఒక గుర్తింపు ఏర్పడుతుంది. అందుకే ప్రఖ్యాత మేనేజ్మెంట్ ఎక్స్ పర్ట్ వ్యక్తులను రెండు వర్గాలుగా విభజించాడు. ఒకవర్గం నాయకత్వ వర్గం అయితే మరొకవర్గం అనుచర వర్గం. ఇలా నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తికి మాత్రమే విజయం లభించి చివరకు సంపద చేకూరుతుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: