ధనం దారిద్ర్యం ఒకే ఆకర్షణ సూత్రం పైనే ఆధారపడి ఉంటాయి. ఎవరి మనసు తనకు అనుకూలంగా ఉంటుందో అతడి వద్దకు దారిద్రం మరియు ఎవరైతే డబ్బును గాఢంగా కోరుకుంటారో వారి వద్దకు సంపద వచ్చి చేరతాయి అని అంటారు. ధన చైతన్యంతో నిండని మనసును దారిద్ర చైతన్యం సులభంగా ఆకర్షిస్తుంది.


సిరి సంపదల సముపార్జనకు పట్టుదల చాలచాల అవసరం. ఆ పట్టుదల లేని వారిదగ్గరకు డబ్బు వచ్చి చేరదు. మన మానసిక జడత్వాన్ని తొలిగించుకోకుండా ఎంత ప్రయత్నించినా డబ్బు మన దరికి చేరదు. నిచ్చెన చివరి మెట్టు గురించి ఆలోచిస్తూ మొదటి మెట్టు కూడ ఎక్కకుండా ఉండే వారి మనసు ఎప్పుడు దారిద్ర చైతన్యంతో నిండి ఉంటుంది.


మన మానసిక జడత్వాన్ని తొలిగించుకుంటూ చేసే పనిలో క్రమంగా వేగాన్ని పెంచుకుంటూ మన పనితీరు పై ఏకాగ్రత పెరిగినప్పుడు మన మనసు నిండా ధన చైతన్యం నిండి ఉంటుంది. అందుకే మన సంకల్పం మీద పూర్తి నియంత్రణ సాధించే వరకు మన ప్రయత్నాలను కొనసాగిస్తూనే ఉండాలి అని అంటారు. గట్టి సంకల్పంతో విజయం సాధించే వ్యక్తికి వచ్చే గౌరవం పరాజయం పొందిన వ్యక్తికి రాదు.


మనకు వచ్చే సమస్యలను ఎదురీది నిలబడి కోరుకున్న లక్ష్యాన్ని సాధించే వ్యక్తులకు భౌతిక ప్రయోజనాలతో పాటు అనంతమైన ఆధ్యాత్మిక ఆనందాలను కూడ పొందుతాడు. ఓటమిని శాస్వితంగా అనుకోకుండా తాత్కాలికం అని అనుకున్నవారికి మాత్రమే ధన చైతన్యం కలుగుతుంది. ఒక విధంగా ఆలోచిస్తే ఓటమిని మించిన శిక్ష జీవితంలో మరొకటి ఉండదు. అందుకే ప్రతి వ్యక్తి తమతమ స్థాయిలలో విజయాలను మాత్రమే కోరుకుంటారు. ప్రముఖ ఆంగ్ల రచయిత హరెస్ట్ వ్రాసిన కథలు మొదట్లో ‘ఈవెనింగ్ పోస్టు’ అనే ప్రముఖ పత్రిక 36 సార్లు తిప్పి పంపినా హరెస్ట్ తన పట్టుదలతో కేవలం నాలుగు సంవత్సరాలలో 1950 ప్రాంతంలో ప్రసిద్ధ ఆంగ్ల రచయిత స్థాయికి ఎదిగి ఆరోజుల్లోనే తన కథకు వేల డాలర్ల లో పారితోషికం తీసుకునే వాడట. అందుకే చైతన్యం గలవాడి దగ్గర మాత్రమే సంపద చేరుతుంది.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: