సిరిసంపదలు జ్ఞానం ద్వారానే లభిస్తాయి. అయితే ఉన్నతమైన పరిజ్ఞానం ఉన్న వ్యక్తికి మాత్రమే సిరిసంపదలు లభిస్తూ ఉంటాయి. జ్ఞానం వేరు చదువు వేరు థామస్ ఆల్వా ఎడిసన్ అతడి జీవితంలో కేవలం మూడు నెలలో మాత్రమే స్కూల్ కు వెళ్ళాడు. అయితే అతడు పెద్దపెద్ద చదువులు చదువుకోకపోయినా జ్ఞానంలో మాత్రం బాగా చదువుకున్న వారికంటే చాల తెలివిగా ఆలోచించడం థామస్ ఎడిసన్ కు చిన్ననాటి నుండి అలవడిన లక్షణం.


అదేవిధంగా ప్రసిద్ధ కార్ల కంపెనీ అధినేత హెన్రీ ఫోర్డ్ కేవలం 6వ తరగతి మాత్రమే చదువుకున్నాడు. కానీ ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఫోర్డ్ కంపెనీ అధినేతగా మారి ప్రపంచ స్థాయి ధనవంతుల లిస్టులో చాల సులువుగా చేరిపోయాడు. ఇలా వీరంతా అద్భుత విజయాలు సాధించడానికి గలకారణం వీరికి చదువు పై ఉన్న పట్టుకాదు జ్ఞానాన్ని ఎలా పెంపొందించుకోవాలో వీరికి తెలిసినంత విధంగా చాలామందికి విషయాలు తెలియవు.


ముఖ్యంగా గ్రంధాలయాలు కళాశాలలు విశ్వవిద్యాలయాలు పత్రికలు ఇచ్చే పరిజ్ఞానం కన్నా జీవితంలో ఎదురైన సంఘటనలను తమ జ్ఞానంగా మార్చుకోగలిగారు. అయితే ఇలాంటి అనుభవాల వల్ల ఏర్పడిన జ్ఞానాన్ని ఒక ప్రణాళికా బద్ధంగా సక్రమంగా వినియోగించుకోగలిగినప్పుడే ఆ జ్ఞానం వీరికి సహకరించడమే కాకుండా తాము ఎంచుకున్న వ్యాపారాలలో ఎలా రాణించాలి అన్న విషయం తనకు కలిగిన జ్ఞాన అన్వేషణలో తెలిసింది అని అంటాడు హెన్రీ ఫోర్డ్. వాస్తవానికి జ్ఞానాన్ని సంపాధించిన తరువాత ఆ జ్ఞానాన్ని ఒక సరైన ప్రణాళికతో వినియోగించుకో గలిగే సామర్ధ్యం కూడ ఉండాలి. అప్పుడే ఏ వ్యక్తి అయినా విజేతగా మారగలుగుతాడు.

ప్రపంచంలో చాలామంది తాము ఎక్కువగా చదువుకోలేకపోవడం వల్ల నష్టపోయాము అని చెపుతూ ఉంటారు. అయితే ఒక విషయంలో విషయ పరిజ్ఞానం సాధించడానికి కేవలం చదువు మాత్రమే సరిపోదు. జ్ఞానాన్ని పెంపొందించుకునే ఆసక్తి ఉండాలి. విజేతలైన వ్యక్తులు తమ జ్ఞానాన్ని తమ వ్యాపారానికి అదేవిధంగా డబ్బు సంపాదించడానికి చాల అనువుగా మార్చుకునే నైపుణ్యత కలిగి ఉంటారు. అందుకే జ్ఞాన సముపార్జన చేయగలిగిన వ్యక్తి మాత్రమే ఐశ్వర్య వంతుడు అవ్వగలడు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: