మన ప్రగాఢ వాంఛను ఆర్ధిక విలువలలోకి మార్చే ప్రక్రియలలో పట్టుదల ఒక ముఖ్యమైన కీలక అంశంగా పనిచేస్తుంది. పట్టుదలకు తల్లి లాంటిది సంకల్ప బలం. సంకల్పం పట్టుదల ప్రగాఢ వాంఛ ఈ మూడు సమపాళ్ళల్లో ఉంచుకుంటూ వాటిని సహేతుకంగా ఉపయోగించుకునే వ్యక్తులు మాత్రమే ధనవంతులు కాగలుగుతారు. వాస్తవానికి బాగా సంపాదించిన వ్యక్తులు చాల సందర్భాలలో గంభీరంగాను మూర్ఖులుగాను దయలేని వారు గాను కనిపిస్తూ ఉంటారు.


అయితే అలా వారు కరుడుకట్టినట్లు ప్రదర్శించకపోతే వారు కష్టపడి సంపాదించుకున్నది అంతా పోగొట్టుకునే ఆస్కారం చాల ఎక్కువగా ఉంటుంది. అందువల్లనే ప్రపంచంలోని ధనవంతులు చాలామంది మనసు రీత్యా మంచివారే అయినప్పటికీ తమ సంపద కోల్పోకుండా పట్టుదలతో కూడిన తమ స్థిర నిర్ణయాలతో అందర్నీ ప్రభావితం చేస్తూ ఉంటారు. చాలామంది తమకు దురదృష్టం తలుపు తట్టిన వెంటనే తమ లక్ష్యాలను గాలికి వదిలేస్తూ ఉంటారు. కొంతమంది మాత్రమే తమకు ఎదురైన ప్రతికూల పరిస్థితులను అధిగమించి తమ లక్ష్యాలను సాదిస్తారు.


దీనితో ఏవ్యక్తి అయినా తమ లక్ష్యాలను అధిగమించాలి అంటే తమకు ఉన్న పట్టుదల పై తమకు తామే ఒక పరీక్ష పెట్టుకోవాలి. వాస్తవానికి విజయానికి మూలస్థానం నిర్విరామ ప్రయత్నం. మనీ ఎక్స్ పర్ట్స్ అభిప్రాయంలో సంపదలకు దారితీసే 8వ అడుగు పట్టుదల అని అంటారు. ఒక వ్యక్తికి ప్రగాఢమైన వాంఛలు లేకపోతే అతడిలో సోమరితనం పెరిగిపోతుంది. దానితో ధనార్జన పై అంతగా ఆసక్తి ఉండదు దీనితో వ్యక్తి చైతన్యం కోల్పోతాడు.


నదులు అన్నీ సముద్రంలో కలిసే విధంగా పట్టుదల ఉన్న వ్యక్తుల వైపు మాత్రమే సిరి సంపదలు పరుగులు తీస్తూ ఉంటాయి. అయితే నిజంగా పట్టుదల ఉన్న వ్యక్తి నిద్రావస్థలో ఉన్నప్పటికీ తాను ఎంచుకున్న లక్ష్యాలను మరిచిపోకుండా మనకు చైతన్యం కలిగేలా మన మనసు నిత్యచైతన్యంతో ఉంటుంది. అందుకే ఎవరి మనసు అయితే సంపదలను ఆకర్షించదానికి సిద్ధంగా ఉంటుందో ఆ సంపదలు కూడ అలాంటి వ్యక్తుల పట్ల ఆకర్షణకు లోనవుతాయి అని అంటారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: