ప్రతి వ్యక్తి తనకు ఊహ వచ్చిన దగ్గర నుండి తనకు భగవంతుడు ఇచ్చిన శక్తి సామర్ధ్యాలను ఉపయోగించుకుంటూ శ్రీమంతుడు గా మారడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే ఈ ప్రయత్నాలతో భౌతిక సంపద కొద్ది మందికి మాత్రమే లభిస్తుంది. ఇలా భౌతిక సంపద లభించి ధనవంతుడుగా మారడానికి ఒక వ్యక్తికి మూడు ప్రధాన లక్షణాలు ఉండాలి.


ముఖ్యంగా ప్రతి మనిషికి ఉండే తన మనసును సంపదగా భావించి ఆ మనసును ఎప్పుడు నిర్మలంగా ఉంచుకోవాలి. అదేవిధంగా నిరాశ నిస్పృహలు లేకుండా ఏకాగ్రతతో నిరంతరం కష్టపడుతూ ఉండాలి. ఇక ముఖ్యంగా ‘నేను ఈ పని చేయలేను’ అన్న భావం తొలిగించుకుని తీరాలి. మనలోనే అనంత శక్తులు దాగి ఉన్నాయని ఏ పనిని అయినా మనం ఖచ్చితంగా విజయవంతంగా చేయగలము అన్న నమ్మకం ప్రతి వ్యక్తిని ధనవంతుడుగా మార్చి తీరుతుంది. 


ముఖ్యంగా ఎన్ని సమస్యలు ఎదురైనా మనకు తోడుగా ఉండే దైవం అనే శక్తి మన వెంట నీడలా ఎప్పుడు ఉంటుంది అన్న నమ్మకం కలిగి ఉన్న ఏ వ్యక్తి జీవితంలో పరాజయం పొందడు అన్న విషయం మనకు బైబిల్ తెలియచేస్తుంది. మరీ ముఖ్యంగా ఎదుట వ్యక్తి పట్ల కృతజ్ఞత తెలియచేయని వ్యక్తి ఎంత సమర్థుడు అయినప్పటికీ సంపన్నుడు కాలేడు. 


అదేవిధంగా ముందుగా ప్రతివ్యక్తి తనలో బయట పడకుండా దాగి ఉన్న జ్ఞాన సంపదను గురించి తెలుసుకుని తీరాలి. ఆ జ్ఞాన సంపద తెలుసుకోగలిగిన వ్యక్తి సుఖం ప్రశాంతత సమస్థితి పొంది ఎలాంటి ఒడుదుడుకులు అయినా తట్టుకోగలుగుతాడు. మన దగ్గర డబ్బు లేకపోయినా పరపతి లేకపోయినా అవన్నీ మన దగ్గర ఉన్నాయి అని భావించుకుంటే ఖచ్చితంగా ప్రతి వ్యక్తి జీవితంలో అద్భుతాలు జరిగి తీరుతాయి. ఆ అద్భుతాలు ఒక వ్యక్తిని చాల సులువుగా ఐశ్వర్య వంతుడు గా మార్చి తీరుతాయి. అందుకే శ్రీమంతుడు కావడం అనేది మన జన్మ హక్కు అని నిరంతరం పాజిటివ్ యాంగిల్ లో ఊహించుకుంటూ ఉండాలని అనేకమంది మనీ ఎక్స్ పర్ట్స్ చెపుతూ ఉంటారు..  

మరింత సమాచారం తెలుసుకోండి: