మనిషి జీవితాన్ని శాసించే డబ్బు ఆధిపత్యంలో కొనసాగుతూ ఉంటాడు. అయితే ఇలా ఒకవ్యక్తి తన జీవితాన్ని డబ్బు ఆదీనంలోకి వెళ్ళిపోయేకన్నా డబ్బు పై తన అధికారాన్ని ఆధిపత్యాన్ని నిలబెట్టుకునే స్థాయిలోకి వెళ్ళినప్పుడు మాత్రమే ఏవ్యక్తి అయినా నిజమైన ధనవంతుడుగా మారగలుగుతాడు అని ప్రముఖ మనీ ఎక్స్ పర్ట్ డాక్టర్ హిల్ అభిప్రాయపడుతున్నాడు.


జీవితంలో ప్రతి ఒక్కరు డబ్బు గురించి మాత్రమే ఆలోచించే విధానంలో కొనసాగుతున్నారని అందువల్ల చాలామంది వద్ద డబ్బు ఉండకపోవడానికి ఇదే కారణం అని జీవితంలో డబ్బు ఒక భాగం మాత్రమే అని భావించాలి కానీ జీవితమే డబ్బు అని భావించే వారిదగ్గర ఎప్పుడు డబ్బు ఉండదు అన్నఅభిప్రాయం చాలామంది వ్యక్తం చేస్తూ ఉంటారు. అయితే ప్రతివ్యక్తి డబ్బు గురించి ఆలోచించడం తప్పు కాకపోయినా ఆ ఆలోచించే విధానంలోనే తప్పు ఉంటుంది.


ముఖ్యంగా డబ్బు పట్ల మనకు ఉన్న ఆలోచనలు భావనలు మారనంత సేపు ఏవ్యక్తి ధనవంతుడుగా మారలేడు. డబ్బు పై మనం అధికారం చెలాయించాలీ అంటే డబ్బును నిర్వహించే కళను ప్రతివ్యక్తి అలవరుచుకోవాలి. ఒక మనిషి ఎదుగుదలకు మానవ సంబంధాల నిర్వహణ ఎంతకీలకమో డబ్బుకు బానిస కాకుండా ఆడబ్బును మనకు అనుకూలంగా నిర్వహించుకోగల నైపుణ్యం ప్రతి మనిషికి ఏర్పడాలి. వాస్తవానికి ప్రపంచ జనాభాలో మన భారతీయులు ఎక్కువగా పొదుపు గురించి ఆలోచనలు చేస్తూ ఉంటారు. పొదుపు ఆలోచనలు మన భారతీయులలో ఉన్నంత ఎక్కువగా పాశ్చాత్య దేశాలలో ఉండే వ్యక్తులలో ఎక్కువగా కనపడదు.


అందువల్లనే మన దేశంలోని డబ్బు చాలామంది పొదుపు ఖాతాలలో బంధీగా ఉండిపోతుంది కానీ అది ఆర్ధిక వ్యవస్థలోకి సర్క్యులేట్ అయి ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించే దిశలో సహాయపడుదు. దీనికితోడు ఒక్క పారిశ్రామిక వర్గాలలో తప్ప సాధారణ వ్యక్తుల జీవితాలలో అప్పులు చేసే వ్యక్తిని చాల చిన్న చూపు చూస్తారు. ఈ ఆలోచనల వల్ల ప్రతి వ్యక్తి అను నిత్యం పొదుపు గురించి మాత్రమే ఆలోచిస్తూ ఆ పొదుపును పెట్టుబడిగా మార్చే ఆలోచనలు చేయలేక డబ్బు మన పై అధికారాన్ని చెలాయించే స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. ఈ స్థితి నుండి మనం బయటపడాలి అంటే డబ్బు మనపై అజమాయిషీ చేయకుండా మనమే డబ్బు ను అదుపులో పెట్టె స్థాయికి ఎదగాలి అప్పుడే సంపద స్థిరంగా ఉంటుంది..

మరింత సమాచారం తెలుసుకోండి: