కరోనా దెబ్బతో అతలాకుతలం అయిపోయిన ఆర్ధిక వ్యవస్థను చక్కదిద్ది భారత్ ను మళ్ళీ ప్రగతి పధంలోకి నడిపించడానికి ప్రధాన మంత్రి మోడీ పారిశ్రామిక రంగానికి సంబంధించి ఉపదేశించిన ఒక మంత్రం ఇప్పుడు ఆర్ధిక వేత్తల దృష్టిని ఆకర్షిస్తోంది. సంకల్పం సమ్మిళితం పెట్టుబడి మౌలిక వసతులు ఆవిష్కరణ ఇలా ఈ ఐదు సూత్రాలను వ్యాపారాలు చేసే వ్యక్తులు సంస్థలు పట్టుదలతో పాటిస్తే భారత్ కార్పోరేట్ రంగం ప్రస్తుత కరోనా సంక్షోభాన్ని తట్టుకుని నిలబడుతుంది అని ప్రధానమంత్రి అభిప్రాయపడుతున్నారు.


ఇలాంటి పరిస్థితులలో భారీ స్థాయిలో చైనా నుంచి విదేశీ కంపెనీలను ప్రస్తుత పరిస్థితులలో భారత్ కు రప్పించుకుని మన ఆర్ధిక వ్యవస్థను పటిష్టం చేయాలి అన్నతలంపులతో భారత్ మొబైల్ కంపెనీల తయారీ సంస్థలకు ప్రకటించిన 50 వేలకోట్ల ప్రోత్సాహాలతో ప్రపంచ మొబైల్ దిగ్గజం యాపిల్ తో సహా అనేక కంపెనీలు చైనాకు గుడ్ బై చెప్పే ఆలోచనలు చేస్తున్నాయి. చైనా తరువాత నిపుణులైన కార్మీకుల విషయంలో అదేవిధంగా తక్కువ వేతనాలకు పనిచేసే కార్మీకుల విషయంలో కూడ భారత్ అన్నివిధాల అనుకూలమని అనేక ప్రపంచ దిగ్గజ సంస్థలు భావిస్తున్న పరిస్థితులలో రానున్న రోజులలో కరోనా భారత ఆర్ధిక సంస్థకు మేలు చేసే మిత్రుడుగా మారే ఆస్కారం కనిపిస్తోంది అంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.


దీనితో రాబోతున్న కొన్ని సంవత్సరాలు 15 నుండి 20 లక్షల మందికి ఉపాది లభిస్తుంది అన్న అంచనాలు వినిపిస్తున్నాయి. దీనితో కరోనా వల్ల దేశంలో నిరుద్యోగం పెరిగినా విదేశీ కంపెనీల రాకతో నిరుద్యోగ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని మోడీ సర్కార్ భావిస్తోంది. ఈవిషయంలో మొబైల్ దిగ్గజ కంపెనీలు మాత్రమే లాభ పడతాయి అని కొందరు విశ్లేషకులు భావిస్తూ ఉంటే ఈ ప్రోత్సాహకాలు వల్ల స్థానికి కంపెనీలకు కూడ ఊతం లభించి దాదాపు 15 వేల కోట్ల పై చిలుకు వ్యాపారం అదనంగా జరిగి తద్వారా భారత్ లో ఉద్యోగ కల్పనా సంపద పెరుగుతుందని మనీ విశ్లేషకులు అభిప్రాయం..

మరింత సమాచారం తెలుసుకోండి: