వంద సంవత్సరాల క్రితం స్పానిష్ ఫ్లూ వచ్చినప్పుడు అప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఏర్పడిన ఆర్ధిక సంక్షోభం నుండి కోలుకోవడానికి నాలుగు సంవత్సరాలు పట్టిందని ఆనాటి చరిత్ర చెపుతోంది. ఇప్పుడు ప్రపంచాన్ని కుదిపేస్తున్న కరోనా సమస్యవల్ల కూడ జనం అతలాకుతలం అవుతున్న పరిస్థితులలో ఈ పరిస్థితుల నుండి జనం తేరుకుని ఆర్ధిక పరిస్థితులు గట్టెక్కడానికి కనీసం రెండు సంవత్సరాలు పడుతుంది అన్న అంచనాలు వస్తున్నాయి.


ఇలాంటి పరిస్థితులలో ఈ తీవ్ర ఆర్ధిక సంక్షోభం నుండి తేరుకోవడానికి ప్రస్తుతం ప్రభుత్వాల నుండి జనం వరకు ఉన్న ఏకైక మార్గం ఖర్చులు తగ్గించుకోవడమే. ప్రపంచ వ్యాప్తంగా కరోనా సమస్యలు మొదలైన తరువాత భారత దేశంలోని 16 నగరాలలో నిర్వహించిన ఒక సర్వేలో జనం వద్ద అనవసరంగా కొన్న వస్తువుల విలువ 78 వేల కోట్ల వరకు ఉంటుందని ఒక అంచనా.


ఇలా ప్రతి ఇంటిలోను అవసరంలేని వస్తువులు కుప్పలుకుప్పలుగా దుస్తులు ఎలట్రికల్ సామాగ్రి వంట పాత్రలు సెల్ ఫోన్స్ గడియారాలు పాదరక్షలు పిల్లల బొమ్మలు పుస్తకాలు ఇలా అనేకం అవసరం ఉన్నా అవసరం లేకపోయినా జనం విపరీతంగా కొన్న నేపధ్యంలో ప్రతి ఇంటిలోను అనవసరంగా కొన్న వస్తువుల విలువ లక్షల రూపాయలలో ఉంటుందని ఆసర్వే తెలియచేస్తోంది. కేవలం భారత్ లోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా ఇదే పరిస్థితి కొనసాగుతోందని ఈసర్వే తెలియచేస్తోంది.


ముఖ్యంగా మన భారత్ లో ఈఅలవాటు ఉత్తారాది ప్రాంతంలో కన్నా దక్షిణాది ప్రాంతంలో చాలఎక్కువ. దీనికికారణం మన పర్సులలో ఉండే క్రెడిట్ కార్డు డెబిట్ కార్డులు ఏదైనా ఒక వస్తువు కొన్నాక పర్సు లోంచి డబ్బు తీసి లెక్కపెట్టాలి అంటే మనసురాని వాళ్ళు తమ డెబిట్ కార్డులను క్రెడిట్ కార్డులను ఉపయోగించడంలో చాల ఉదారంగా ఉంటున్న పరిస్థితులలో ఈ అనవసరపు వస్తువుల కొనుగోలు ఎక్కువైపోయింది అన్న విశ్లేషణలు వస్తున్నాయి. దీనితో ప్రస్తుత పరిస్థితులలో ఎంతటి వారికైనా ఖర్చుల పై నియంత్రణ అని మనీ ఎక్స్ పర్ట్స్ చెపుతున్నారు. ఈ కరోనా సమయంలో వడ్డీలేని రుణాలు ఇస్తాము అని విపరీతంగా ప్రకటనలు ఇస్తున్న కంపెనీల ట్రాప్ లో పడకుండా మన డబ్బును ఖర్చు పెట్టే విషయంలో సరిగ్గా ప్లాన్ చేసుకోకపోతే ఈ కరోనా పరిస్థితులు మన ఆరోగ్యం పైనే కాకుండా మన ఆర్ధిక పరిస్థితి పై కూడ తీవ్రంగా ప్రభావితం చేసే ఆస్కారం ఉంది.. 

మరింత సమాచారం తెలుసుకోండి: