ప్రస్థుత కరోనా పరిస్థితులలో వ్యక్తుల దగ్గర నుండి సంస్థల వరకు ఈవ్యతిరేక పరిస్థితులను ఎదుర్కొనడంలో తమ వ్యూహాలు అనుక్షణం మార్చుకుంటున్నాయి. ఈనేపధ్యంలో ప్రస్తుతం అన్ని రంగాలలోను వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ బాగా పెరిగిపోయింది.


దీనివల్ల కంపెనీలకు నిర్వాహణా ఖర్చులు బాగా తగ్గినా ఈపద్ధతిని శాస్వితంగా అనుసరించడం వల్ల ప్రస్తుతం అనేక కంపెనీలకు ఉద్యోగాలు చేస్తున్న వారికి ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ కొంచం ఇష్టం కొంచం కష్టంగా మారింది అన్నమాటలు వినిపిస్తున్నాయి. కంపెనీలకు సంబంధించి ఉద్యోగులను అందర్నీ ఒక గ్రూప్ గా చేసి చేయవలసిన పనులు కష్టంగా మారితే ఉద్యోగులకు సంబంధించి తమ కుటుంబ సభ్యులతో గడిపే సమయం పెరిగినా ఉద్యోగుల పై మరింత అదనపు ఒత్తిడి పెరుగుతోంది అని సర్వేలు చెపుతున్నాయి.


ముఖ్యంగా ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్న ఉద్యోగులకు సంబంధించి ‘ఆఫీసుకు వచ్చే రాకపోకల సమయం వృథా కాదు కనుక ఆ సమయాన్ని కూడ తమ కంపెనీ పనులకు వినియోగించమని ఈ కరోనా సమయంలో ఉద్యోగుల పై ఒత్తిడి పెరుగుతున్నట్లు అనేక సర్వేలు చెపుతున్నాయి. ఇంట్లోనే ఉంటున్నారు కదా అదనపు గంటలు పనిచేయడానికి సమస్య ఏమిటి’ అంటూ కొన్ని సంస్థలు తమ ఉద్యోగుల పై తీవ్ర ఒత్తిడి పెంచుతున్నట్లు ఈ సర్వే తెలియచేస్తోంది.


దీనికితోడు ఇదివరకు మేనేజర్ స్థాయి ఉద్యోగులు గతంలో తమ టీమ్ ను ఎప్పటికప్పుడు ట్రాక్ లో పెట్టుకుంటూ తమ టీమ్ లో వర్క్ సరిగ్గా చేయలేని వారిని కాపాడే వారని ఇప్పుడు ఎవరి పని వారికి నిర్దేశ్యం జరగడంతో ప్రతిరోజు టాస్క్ లో ఆతరువాత రివ్యూలు ఆపై ఎంత బిల్ చేసారు అంటూ నోట్ అవుతూ ఉండటంతో ఉద్యోగులలో నిరంతర టెన్షన్ పెరిగి పోతోంది అని ఈ సర్వే చెపుతోంది. ఇలాంటి పరిస్థితులలో శాస్వితంగా వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ కొనసాగించడం జరగక పోవచ్చని ఈవిధానం అటు ఉద్యోగులకు కాని అదేవిధంగా ఇటు కంపెనీలకు కాని శ్రేయస్కరం కాదు అని వస్తున్న సర్వే రిపోర్ట్స్ కు ఎలాంటి పరిష్కారాలు వెతకాలి అన్నఆలోచనలు అనేక కార్పోరేట్ కంపెనీలు చేస్తున్నట్లు సమాచారం..

 

మరింత సమాచారం తెలుసుకోండి: