ప్రస్తుతం కరోనా పరిస్థితుల నేపధ్యంలో ఎక్కడ చూసినా నిరాశ గొప్పవారి దగ్గర నుండి సామానుఅల వరకు ప్రస్తుత అయోమయ పరిస్థితుల నుండి ఎప్పుడు బయటపడతారో ఏమి తెలియని పరిస్థితి. ఈ సంవత్సరం ఆగష్టు 15 నాటికి కరోనా కు వ్యాక్సిన్ వస్తుంది అన్న ఆశలు నీరుకారిపోతున్నాయి. కేవలం ప్రకటనల కోసమే ఇలాంటి వార్తలు వస్తున్నాయని వ్యాక్సిన్ రావడానికి కనీసం ఒక సంవత్సరం పైగా పడుతుందని అనేకమంది శాస్త్రవేత్తలు వైద్య పరిశోధకులు అభిప్రాయపడుతున్నారు.


ఇలాంటి పరిస్థితులలో ప్రజల వద్ద డబ్బు ఉన్నా ఎక్కడ పెట్టుబడి పెట్టాలో తెలియక తెగ ఇబ్బంది పడిపోతున్నారు. ఇలాంటి పరిస్థితులలో మనీ విశ్లేషకులు పెట్టుబడులకు సంబంధించి ఈవ్యూహాలను అనుసరించినప్పుడు మాత్రమే మన డబ్బు రక్షణ ఏర్పడి మన దగ్గర ఉన్న డబ్బు ఒకటికి పదింతలు అవుతుందని కొన్ని సూచనలు ఇస్తున్నారు.


ప్రస్తుత పరిస్థితులలో ఎంత తెలివైన వ్యక్తి అయినప్పటికీ అప్పు చేసి పెట్టుబడులు పెట్టకూడదని రానున్న రోజులలో వ్యాపారం ప్రజల అభిరుచులు ఎలా మారిపోతాయో అంచనాలకు అందడం లేదు కాబట్టి అప్పు చేసి వ్యాపారాలు మొదలుపెడితే అసలకు చిల్లుపడే ప్రమాదం ఉంది అంటూ హెచ్చరికలు ఇస్తున్నారు. అదేవిధంగా ప్రస్తుతం పెట్టె పెట్టుబడులు కేవలం దీర్ఘకాలంలో మాత్రమే ఫలితాలు ఇస్తాయని అందువల్ల స్వల్పకాలిక లక్ష్యాలతో ప్రస్తుత పరిస్థితులలో పెట్టుబడులు పెట్టవద్దు అన్న హెచ్చరికలు అనేకమంది ఆర్ధిక విశ్లేషకులు ఇస్తున్నారు.


ఇదే సందర్భంలో మన ఆర్ధిక లక్ష్యాలు చాలస్పష్టంగా ఉండాలని రాబోతున్న మరో రెండు సంవత్సరాలలో ప్రజల నిత్యావసరాలకు సంబంధించిన వ్యాపారాలు తప్ప మరే వ్యాపారం పెద్దగా పుంజుకునే ఆస్కారం లేదు అని విశ్లేషకుల అభిప్రాయం. ముఖ్యంగా ప్రస్తుత కరోనా పరిస్తులలో ఒకవ్యక్తి ఆర్ధికంగా నష్టాల బాట పట్టకుండా ఉండాలి అంటే మనం పెట్టే పెట్టుబడికి సంబంధించిన భద్రత గురించి చాలలోతుగా ఆలోచించాలని కేవలం ఆవేసపూరితమైన నిర్ణయాలు తీసుకోకుండా మనం చేయబోయే వ్యారానికి సంబంధించి నిష్ణాతులైన వారి దగ్గర నుంచి సలహాలు తీసుకున్నవారు మాత్రమే ఈ కరోనా సమయంలో వ్యాపార రంగంలో విజేతలు అయి సంపన్న వంతులు అవుతారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: