ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ భయాలు రోజురోజుకు పెరిగిపోతున్న పరిస్థితులలో విద్యార్ధులను పాఠశాలలో కూర్చోపెట్టి క్లాసులు చెప్పే రోజులు కంపెనీలు తమ ఉద్యోగులతో భౌతిక దూరం పాటిస్తూ మీటింగ్ లు పెట్టుకునే రోజులు ఇప్పట్లో లేకపోవడంతో అందరు జూమ్ యాప్ ను నమ్ముకుని తమ వ్యాపార కార్యకలాపాలు విద్యార్ధులకు క్లాసులు నిర్వహించడం కోనసాగిస్తున్నారు. ప్రస్తుతం ఈయాప్ కు ఏర్పడిన ప్రాముఖ్యత రీత్యా మనదేశంలో ఈయాప్ ను 20 కోట్లమంది డౌన్ లోడ్ చేసుకున్నారు అన్నమాటలు వినిపిస్తున్నాయి.


కాలేజీలు సాఫ్ట్ వేర్ కంపెనీలు ఇలా ఎవరినోట ఎక్కడ విన్నా జూమ్ పేరు వినిపిస్తుంది. దీనితో ఈకంపెనీ షేర్ల విలువ మార్కెట్ లో రోజురోజుకు పెరిగిపోతోంది. వాస్తవానికి ఈకంపెనీ కాలిఫోర్నియాలో రిజిష్టర్ అయినప్పటికీ ఈకంపెనీ వ్యవస్థాపకుడు ప్రభాస చైనీయుడు కావడం ఈయాప్ ను చైనా లో ఉన్న 700 మంది టీమ్ ను డెవలప్ చేయడంతో ఈయాప్ ను కూడ నిషేదించాలి అంటూ భారత్ లో ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి.


దీనితో జరుగుతున్న ఈపరిణామాలను తనకు అనుకూలంగా మలుచుకోవడానికి భారతీయ ఇంటర్నెట్ సేవా సంస్థల దిగ్గజం రిలియన్స్ అనుబంధ సంస్థ జియో తనకు వేలకోట్ల ఆదాయం వచ్చే మార్గంగా మలుచుకోబోతున్నట్లు సంకేతాలు వస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో 30 వేలకోట్ల ఆదాయానికి అవకాశం ఉన్న వీడియో కౌన్సలింగ్ వ్యాపారం పై దృష్టి సాధించడమే కాకుండా ‘జియో మీట్ యాప్’ ను అత్యంత వేగంగా రూపొందించి కేవలం ఒక్క వారంరోజులు క్రితమే భారతీయ మార్కెట్ లో విడుదలచేసారు.


ఈజియో మీట్ యాప్ యూజర్ ఇంటర్ ఫేజ్ డిటో జూమ్ లా ఉందని విమర్శలు వస్తున్న పరిస్థితులలో జూమ్ సంస్థ ప్రతినిధులు జియో పై దావాలు వేస్తామని ప్రకటనలు ఇస్తున్నారు. అయితే ప్రస్తుతం ఈకరోనా సమయంలో కూడ 30 వేల కోట్ల వ్యాపారానికి అవకాశాన్ని కల్పిస్తున్న ఈకొత్త వ్యాపార అవకాశాలను వదులు కోవడానికి ఇష్టంలేక జూమ్ తో జియో వాణిజ్య యుద్ధానికి సిద్ధం అవుతోంది. ఈయుద్ధంలో జియో గెలిస్తే ఈకరోనా వ్యతిరేక పరిస్థితులలో కూడ వేలసంఖ్యలో యువతకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి..    

 

మరింత సమాచారం తెలుసుకోండి: