సాధారణంగా ఒకరి దురదృష్టం మరొకరికి అదృష్టంగా మారుతుంది. అయితే ప్రపంచ కుబేరుల జాబితాలలో స్థానాలు తారుమారు అయి ముకేష్ అంబానికి 7వ స్థానంలోకి రావడానికి బఫెట్ దాతృత్వమే ప్రధాన కారణం అని తెలిస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. గతవారం బఫెట్ తన సంపదలో 2.9 బిలియన్ డాలర్లను దాతృత్వ కార్యక్రమాలకు కేటాయించడంతో ఆయన సంపద తగ్గింది.


2006 నుంచి ఇప్పటి వరకు బఫెట్ 37 బిలియన్ డాలర్ల విలువైన తన ‘బెర్క్ ఫైర్ హాత్ వే’ షేర్లను సామాజిక కార్యక్రమాల కోసం వితరణ చేయడానికి అమ్మివేయడంతో ఆయన సంపద తగ్గింది. దీనితో ప్రపంచ కుబేరుల స్థానాలలో మార్పులు వచ్చి ముకేష్ అంబాని తరువాత స్థానంలో బఫెట్ నిలిచినా దాతృత్వంలో మటుకు ముకేష్ అంబాని కంటే ముందు స్థానంలోనే ఉన్నారు అంటూ కొందరు విశ్లేషకుల అభిప్రాయం.


ఈ కరోనా కష్ట కాలంలో కూడ వెనకడుగు వేయకుండా ముకేష్ అంబాని సంపద ఇప్పుడు మన ఇండియన్ కరెన్సీ విలువ ప్రకారం 5.25 లక్షల కోట్లకు చేరుకోవడం కార్పోరేట్ వర్గాలలో ఒక సంచలన వార్తగా మారింది. 1960 ప్రాంతాలలో ముకేష్ తండ్రి దీరుబాయ్ అంబాని ముంబాయ్ మహా నగరంలోని సైకిల్ పై తిరిగేవాడు అని అప్పటి కాలంలోని వ్యక్తులు ఇప్పటికీ చెపుతూ ఉంటారు.


అయితే తన తండ్రి స్థాపించిన పారిశ్రామిక సామ్రాజ్యాన్ని ముకేష్ తన తెలివితేటలతో మరింత వృద్ధిచేసి ఇప్పుడు ప్రపంచంలోని ధనవంతుల లిస్టులో స్థానం సంపాధించుకోవడం భారత్ కార్పోరేట్ రంగం గర్వంగా ఫీల్ అవుతోంది. ఆషియా నుంచి ఒక అంబానికి మాత్రమే చోటు దక్కడం ఇప్పుడు సంచలన వార్తగా మారింది. పరోక్షంగా దేశ పారిశ్రామిక విధానాలను ప్రభావితం చేసే ముకేష్ అంబాని వ్యాపార నిర్వాహణలో ఒక స్థిరనిర్ణయం తీసుకుంటే ఎన్ని ఒత్తిడులు వచ్చినా ఆయన మెట్టు దిగరు అని అంటారు. ఆయన విజయానికి ఇలా అనేక కారణాలు ఉన్నాయి..

మరింత సమాచారం తెలుసుకోండి: