మనదేశాన్ని స్వావలంబన భారత్ గా మార్చడానికి తయారీ రంగాన్ని మరింత అభివృద్ధి పరచాలని రిలయన్స్ ఇండస్ట్రీ చైర్మెన్ ముఖేష్ అంబానీ చాలగట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. నేటి యువతరం క్లిక్ లపై కంటే బ్రిక్ లపై ఆలోచన చేయవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయని ఆయన అభిప్రాయం. తన తండ్రి ధీరూబాయ్ అంబాని ఒకానొక సమయంలో తనను అడిగిన ప్రశ్నకు సమాధానమే రిలయన్స్ జియో అంటూ కామెంట్స్ చేసాడు.


భారతదేశంలో ప్రతి భారతీయుడు ఒక పోస్ట్ కార్డు ఖర్చుతో ఒకరితో ఒకరు మాట్లాడుకునే అవకాశం వస్తుందా అంటూ తనను తరుచూ అడిగిన ప్రశ్నలను గుర్తుకు చేసుకుంటూ ఆ ప్రశ్నలకు సమాధానమే జియో అని అంటున్నాడు. ఇది ఇలా ఉండగా టెలికాం రంగంలో మరో సంచలనానికి రంగం సిద్ధం చేస్తున్న జియో ఆలోచనలు ఇప్పుడు ఏరంగంలోని అనేక ప్రముఖ సంస్థలకు దడ పుట్టిస్తున్నాయి.


త్వరలో 2500 లకే 5జీ స్మార్ట్ ఫోన్ ను అందరికీ అందుబాటులోకి తీసుకు రావాలని ముఖేష్ అంబాని జియో తరఫున చేస్తున్న ప్రయత్నాలు విజయవంతం అయితే ఈరంగంలో ఆదిపత్యం చెలాయించాలని గట్టి ప్రయత్నాలు చేస్తున్న ఎయిర్ టెల్ కు గట్టి పోటీ తప్పదు అన్న అంచనాలు వస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో కొత్త ఖాతాదారుల సంపాదనలో కూడ జియో తన హవా కొనసాగిస్తోంది.


జూలై నెలలో దేశం మొత్తం మీద టెలికాం రంగానికి సంబంధించి 35 లక్షల మంది కొత్త ఖాతా దారులు ఏర్పడితే అందులో రిలయన్స్ జియో ఒక్కటే 25 లక్షలమంది ఖాతాదారులను సంపాదించడం విశేషం. గతంలో 15 వందలకు 4జీ ఫోన్ ను మార్కెట్ లో విడుదల చేసి కోట్ల సంఖ్యలో కొత్త ఖాతాదారులను ఏర్పరుచుకున్న జియో ఇప్పుడు 5జీ స్మార్ట్ ఫోన్ ను 2500లకే ఇవ్వగలిగితే ఇక దేశంలో ప్రతి వ్యక్తి చేతిలోనూ 5జీ స్మార్ట్ ఫోన్స్ కనిపిస్తూ జనం సెల్ ఫోన్స్ కు మరింత బానిసలు అయ్యే ఆస్కారం ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి: