దేశంలో ప్రముఖ బ్రాండ్స్ అన్నీ రాబోతున్న దసరా దీపావళి సీజన్ పై కొండంత ఆశలను పెంచుకుంటే వారి ఆశలను నిరాశ పరిచే పరిస్థితులు ఏర్పడ్డాయి అంటూ యూగవ్ సర్వే వెల్లడించిన వివరాలు ఆశ్చర్య పరుస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో సగం మందికి పైగా రానున్న దసరా దీపావళి ఖర్చుల పై ఆచితూచి వ్యవహరిస్తున్నారని ఈ సర్వే తెలియచేస్తోంది.


దేశవ్యాప్తంగా వివిధ వర్గాలకు చెందిన 25 వేల మందిని రాబోతున్న పండుగల విషయంలో వారి ఆశక్తి గురించి అడిగిన అనేక ప్రశ్నలకు అనేక షాకింగ్ సమాధానాలు వచ్చినట్లు ఈ సర్వే పేర్కొంది. ప్రస్తుతం వీరంతా పండుగల ఖర్చును చాల వరకు తగ్గించుకునే ఆలోచనలలో ఉండటంతో గాడ్జెట్లు దుస్తులు కొత్తవి కొనుగోలు చేసే ఉద్దేశ్యంలో కేవలం 22 శాతం మంది మాత్రమే ఉన్నట్లు ఈ సర్వే వివరాలు వెల్లడిస్తున్నాయి.


అదేవిధంగా కన్జ్యూమార్ అప్లయన్స్ విషయంలో ఎన్ని ఆఫర్లు పెట్టినా కేవలం 17శాతం మంది మాత్రమే తమ దగ్గర ఉన్న పాత వాటిని తీసేసి కొత్త మోడల్స్ ను కొనే ఉద్దేశ్యంలో ఉన్నారని ఇక రాబోతున్న దీపావళికి కేవలం 12 శాతం మంది మాత్రమే కొత్త ఆభరణాలు రకరకాల డిజైన్స్ లో కొనేందుకు ఆశక్తి కనపరుస్తున్నారని ఈ సర్వే వివరాలు వెల్లడిస్తున్నాయి. దీనితో దసరా దీపావళి సేల్స్ తో మళ్ళీ గట్టెక్కాలని ప్రయత్నాలు చేస్తున్న అనేక మల్టీ నేషనల్ కంపెనీలు బ్రాండెడ్ కంపెనీలు దిగాలు పడిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.


అయితే ఈ దసరా దీపావళి సీజన్ లో స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు 48 శాతం ఉండవచ్చు అన్న సంకేతాలు రావడంతో సెల్ ఫోన్ కంపెనీలు సంబరపడుతున్నాయి. అయితే ఎవరూ ఊహించని విధంగా దేశంలోని రెండవ శ్రేణి మూడవ శ్రేణి పట్టణాలతో పాటు ఆఖరకు చిన్నచిన్న పల్లెల నుండి కూడ ఆన్ లైన్ కొనుగోళ్లకు విపరీతమైన స్పందన రావడంతో ఈ పండగ సీజన్ ను నమ్ముకుని కొత్త స్టాకులు తెచ్చి పెట్టుకుని వ్యాపారం చేయాలి అని భావించిన చిన్న తరహా మధ్య తరహా వ్యాపారులు తీవ్ర నిరాశలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఆచితూచి ఖర్చు దేనికి సంకేతం అనుకోవాలి..

మరింత సమాచారం తెలుసుకోండి: