ప్రపంచ జనాభా ఇప్పుడు రెండే విషయాల గురించి ఎక్కువగా ఆలోచనలు చేస్తోంది. కరోనా సెకండ్ వేవ్ ఏ స్థాయిలో ఉంటుంది అమెరికా అధ్యక్షడి ఎన్నికల తరువాత స్టాక్ మార్కెట్ ఏమౌతుంది అన్న ప్రశ్నల చుట్టూ ఆలోచనలు కొనసాగుతున్నాయి. ప్రపంచ జనాభాలో అమెరికా వాటా కేవలం 5 శాతం మాత్రమే.

కానీ ప్రపంచ సంపదలో అమెరికా వాటా 20 శాతం మించి ఉంటుంది. అందువల్లనే అమెరికన్ డాలర్ ఎప్పటికీ ప్రపంచాన్ని శాసిస్తూనే ఉంటుంది. ఈ పరిస్థితులలో ప్రపంచంలోని ప్రతి వ్యక్తి అమెరికా అధ్యక్ష ఎన్నికలను చాల నిశితంగా పరిశీలిస్తూ ఉంటాడు. ప్రపంచ ఆర్ధిక వ్యవస్థను ప్రభావితం చేసే ఈ అధక్ష ఎన్నికల ఫలితాలు ఇండియన్ స్టాక్ మార్కెట్ పై కూడ ప్రభావాన్ని చూపెడతాయి. దీనితో మదుపర్లు ప్రస్తుతం మన భారత్ లో చాల అప్రమత్తంగా వ్యవహరిస్తూ స్టాక్ మార్కెట్ లో ఉన్న తమ దీర్ఘకాలిక పెట్టుబడులు తగ్గించు వేస్తూ అప్రమత్తంగా వ్యవహరించడమే కాకుండా స్వల్ప కాలిక క్రయవిక్రయాలతో సరిపెట్టుకుంటున్నారు.

దీనితో ప్రస్తుత స్టాక్ మార్కెట్ లో అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు అత్యుత్సాహం ప్రదర్శించ వద్దని విశ్లేషకులు మదుపర్లకు సలహాలు ఇస్తున్నారు. కోవిడ్ పరిస్థితుల వల్ల కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు ప్రస్తుతం బాగా కోలుకున్నప్పటికీ అమెరికా అధక్ష ఎన్నికల తరువాత ఎదో జరగబోతోంది అన్న సందేహాల మధ్య స్టాక్ మార్కెట్ అడుగులు వేస్తోంది.

వాస్తవానికి ట్రంప్ బైడన్ లో ఎవరు గెలిచినా ఇండియా ఆర్ధిక పరిస్థితి పై పెద్ద ప్రభావం ఉండకపోయినప్పటికీ ట్రంప్ గెలిస్తే స్టాక్ మరింత పెరుగుతుందని బైడన్ గెలిస్తే స్టాక్ మార్కెట్ కుప్ప కూలుతుందని కొన్ని అంచనాలు ప్రచారంలో ఉన్నాయి. ఈ పరిస్థితి అమెరికాతో పాటు ఇండియాలో కూడ కొనసాగే ఆస్కారం ఉంది. అయితే స్టాక్ మార్కెట్ కూలినప్పటికీ ఆ పరిస్థితి కేవలం తాత్కాలికం అనీ మరో రెండు నెలలలో స్టాక్ మార్కెట్ పరుగులు తీయడం ఖాయం అని అంటున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: