bank OF INDIA' target='_blank' title='రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పరపతి విధాన కమిటీ సమావేశం ఈనెల 2వ తారీఖు న జరగబోతోంది. ఆ సమావేశంలో రిజర్వ్ బ్యాంక్ ప్రస్తుతం దేశంలో ద్రవ్యోల్బణం ఏస్థాయిలో ఉంది ఆర్ధిక పునరుత్తేజం పై ఆర్ బీ ఐ చేయబోయే వ్యాఖ్యల గురించి మదుపర్లు చాల ఆశక్తిగా ఎదురు చూస్తున్నారు.


సెప్టెంబర్ త్రైమాసిక జీడీపీ గణాంకాలు అంచనాలకంటే మించి ఉండటంతో ఆర్ బీ ఐ తీసుకోబోయే నిర్ణయాల పై ఈ వారం స్టాక్ మార్కెట్ కదలిక ఆధారపడి ఉంది. ఈ వారం ఐటీ కంపెనీల షేర్లు లాభాల బాటలో కొనసాగవచ్చు అన్న అంచనాలు వస్తున్నాయి. దీనితో ఇన్ఫోసిస్ టీసీఎస్ షేర్ల పై కదలికల పై బ్రోకరేజ్ కంపెనీలు బులిష్ గా ఉన్నాయి.


దేశంలో కరోనా వ్యాక్సిన్ అభివృద్ధికి సంబంధించిన సంకేతాలు సానుకూలంగా వస్తున్న పరిస్థితులలో ఫార్మా రంగ వృద్ధి బలంగా కనిపిస్తూ ఉండటంతో ఫార్మా రంగ షేర్లలో బాగా కదలికలు రావచ్చు. ఇక బ్యాంకింగ్ రంగ షేర్ల ట్రేడింగ్ చాల తక్కువగా జరిగే పరిస్థితులలో ఈవారం బ్యాంకింగ్ రంగ షేర్లలో పెద్ద చైతన్యం ఉండకపోవచ్చు అన్న అంచనాలు వస్తున్నాయి. ఇక ప్రభుత్వరంగ చమురు కంపెనీల షేర్లు కూడ ఈవారం అంతంతమాత్రంగానే కదలాడుతాయని గతవారం 4 శాతం నష్టపోయిన భారతీ ఎయిర్ టెల్ ఈవారం బాగా రాణించే ఆస్కారం ఉంది.


నిన్న గురునానక్ జయంతి సందర్భంగా షేర్ మార్కెట్లకు సెలవు కావడంతో ఈరోజు నుంచి మొదలుకాబోతున్న షేర్ మార్కెట్ పాజిటివ్ గా ఉండే ఆస్కారం ఉంది. ఈపరిస్థితులు ఇలా ఉంటే కరోనా పరిస్థితులు వల్ల దేశ ఆర్ధిక వ్యవస్థ వ్యక్తుల ఆదాయాలు అంతంత మాత్రంగానే ఉన్నప్పటికీ ప్రైమరీ మార్కెట్ మళ్ళీ కళకళ లాడుతోంది. గత 11 నెలలలో 12 కంపెనీలు ఐపిఓ ల ద్వారా ఇప్పటివరకు 25 వేల కోట్లు సమీకరించడంతో గురించి ఐపీఓ మార్కెట్ లో మళ్ళీ జోష్ కనిపిస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: