మనదేశంలో స్టాక్ మార్కెట్ సంపద మన దేశ జీడీపీ ని మించిపోవడం అత్యంత ఆశ్చర్యంగా మారింది. ప్రస్తుత ఆర్దిక సంవత్సరానికి భారత్ జీడీపీ 194.8 లక్షల కోట్లకు పరిమితం కావచ్చని జాతీయ గణాంకాలు చెపుతున్నాయి. ప్రస్తుతం బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మొత్తం క్యాపిటైలేజేషన్ 196 లక్షల కోట్ల పై మాటే అనీ ప్రస్తుత అంచనాలు వస్తున్న పరిస్థితులలో మనదేశ జీడీపీ కంటే షేర్ మార్కెట్ సంపద అధికంగా ఉండటం బట్టి మనదేశంలో ప్రజలు వద్ద సంపద ఏస్థాయిలో ఉందో అర్థం అవుతుంది.


ఇది ఇలా ఉంటే ఈవారం షేర్ మార్కెట్ ప్రారంభం రోజున వచ్చిన భారీ పతనం నుండి కోలుకుని మళ్ళీ పరుగులు తీస్తూ ఉండటంతో మదుపర్లలో ఉత్సాహం పెరిగిపోతోంది. ఒకరోజు మదుపర్లను టెన్షన్ పెట్టిన షేర్ మార్కెట్ ఉరకలు పెడుతూ పరుగులు తీయడంతో మార్కెట్ లో కొనుగోళ్ళ సునామీ కనిపించింది.


దీనికి కారణం అమెరికా ఉద్దీపన పై ఆశలు పెరగడంతో పాటు విదేశీ పెట్టుబడులు స్థిరంగా కొనసాగడం రూపాయి బలపడటం వంటి కారణాలను ప్రముఖంగా పేర్కొంటున్నారు. మార్కెట్ పరుగులు తీయడంతో కేవలం ఈ రెండు రోజులలోనే మదుపర్ల సంపద 4 లక్షల కోట్లు పెరిగి పోయింది. కేవలం పెద్ద స్థాయి షేర్లు మాత్రమే కాకుండా చిన్న స్థాయి షేర్లు కూడ పెరగడంతో మార్కెట్ జోష్ లోకి వెళ్ళిపోయింది.


దీనికితోడు మార్చి నుండి అందరికీ కరోనా టీకాలు అందుబాటులోకి వస్తుంది అన్నవార్తలు వస్తూ ఉండటంతో మనదేశం కరోనా ని జయించినట్లే అన్న భావనతో షేర్ మార్కెట్ లో పెట్టుబడులు పెరిగిపోతున్నాయి. ఇది ఇలా ఉండగా రాబోయే 5 సంవత్సరాల కాలంలో ప్రపంచంలో చాలామంది ఆస్థులు గాలి బుడగలు లా పేలిపోతాయి అంటూ ప్రపంచ ఆర్ధిక ఫోరం ఒక నివేదికలో తెలియచేస్తూ ప్రపంచాన్ని ఇంకా అనేక వైరస్ కష్టాలు వెంటాడబోతున్నాయని అందువల్ల వ్యాక్సిన్ వచ్చినప్పటికీ జనం ఆరోగ్యానికి సంబంధించి ఎటువంటి రిస్క్ లు చేయవద్దనీ హెచ్చరికలు చేస్తోంది..

మరింత సమాచారం తెలుసుకోండి: