కేంద్ర ప్రభుత్వం రైతన్నల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త స్కీమ్ లను అందుబాటులోకి తీసుకు వస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అందులో ముఖ్యంగా " పీఎం కిసాన్ సమ్మాని నిధి స్కీమ్ "  గురించి ఖచ్చితంగా చెప్పుకుని తీరాల్సిందే.. ఇప్పటికే ఎంతో మంది రైతులు ఈ స్కీమ్ లో చేరి ప్రయోజనం పొందుతున్నారు. అయితే  దాదాపుగా కొన్ని సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వం రైతులకు మూడు విడతల్లో రూ. 2 వేల చొప్పున జమ చేస్తోంది. ఇది ఇలా ఉంటే  గత రెండు సంవత్సరాల నుంచి కేంద్రం ఏడు విడతల్లో రైతుల ఖాతాల్లో డబ్బులను జమ చేసింది. అయితే త్వరలో ఎనిమిదో విడుత డబ్బులను  కూడా జమ చేసేందుకు సన్నాహాలు సిద్ధం చేస్తోంది.  


ముఖ్యంగా చెప్పాలంటే ఈ స్కీమ్ గురించి చాలామంది రైతన్నలకు తెలియదు. అంతేకాకుండా ఎంతోమంది రైతులు ఇంకా ఈ స్కీమ్ లో చేరకపోవడం తో ఈ డబ్బులని పొందలేకపోతున్నారు. అయితే ముఖ్యమైన విషయం ఏమిటంటే…? ఈ స్కీమ్ లో ఎప్పుడైనా చేరే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఒకవేళ ఈ స్కీమ్లో చేరాలనుకుంటే  ఇప్పుడు చేరిన ఆలస్యం ఏమి లేదు.


ఇప్పుడు చేరినా రైతుల ఖాతాలో డబ్బులు  జమ అవుతాయి. జూన్ 30లోపు కనుక  ఈ స్కీమ్ లో చేరినట్లయితే అలాంటి వారికి రెండు ప్రయోజనాలు లభించనున్నాయి. ఎందుకంటే  జూన్‌ లేదా జూలైలో 2 వేల రూపాయలను ఈ రైతులు పొందొచ్చు. ఈ పథకంలో చేరడానికి ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ ద్వారా ఈ స్కీమ్ లో  చేరవచ్చు అయితే ఈ స్కీమ్ లో చేరడానికి సులువుగా అప్లై  https://pmkisan.gov.in/ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.


మరింకెందుకాలస్యం, మీరు ఒకవేళ ఈ స్కీం లో చేరకుండా ఉండింటే, వెంటనే పైన ఇచ్చిన లింకు ద్వారా ఈ స్కీమ్ కు అప్లై చేసుకోవచ్చు. ఇక ఎటువంటి ఖర్చు లేకుండా ఉచితంగా నాలుగు వేల రూపాయలను పొందవచ్చును.. ఇది రైతన్నలకు సదవకాశం అని చెప్పవచ్చు..


మరింత సమాచారం తెలుసుకోండి: