మన భారతదేశంలో ముఖ్యంగా ప్రజల కోసం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు, పోస్టాఫీసులు ఎన్నో రకాల స్కీమ్ లను అందుబాటులోకి తీసుకువచ్చాయి. ఇక ఆ స్కీం లలో ముఖ్యంగా చాలా మంది మ్యూచువల్ ఫండ్స్ ని ఆశ్రయిస్తున్నారు. అయితే ఈ మ్యూచువల్ ఫండ్స్ లో కూడా రెండు రకాల ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. అవేంటో వాటి ద్వారా కలిగే లాభాలు ఏమిటో ఇప్పుడు ఇక్కడ చదివి తెలుసుకుందాం..

ఒకటి సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (SIP ), మరొకటి సిస్టమేటిక్ విత్ డ్రాయల్ ప్లాన్ (SWP ). ఇక వీటి వివరాలు తెలుసుకుందాం.


సాధారణంగా రిటైర్మెంట్ ప్లాన్ అనేది చాలా ఎక్కువ కాలం ఉంటుంది.  ఇక ఇందులో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు కనీసం 25 సంవత్సరాల నుండి 25 సంవత్సరాల పాటు నెలవారి పెట్టుబడి పెట్టుకోవాలి. ఇంకా అయితే మీరు ఈ సంవత్సరాల కాలంలో పెట్టే పెట్టుబడికి పది శాతం కంటే ఎక్కువ రిటర్న్స్ ఇస్తున్నాయి మ్యూచువల్ ఫండ్స్  ప్లాన్స్.

ముందుగా మీరు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే 20 సంవత్సరాల పాటు పెట్టుబడి పెట్టే లాగా చూసుకోవాలి. తర్వాత మరో 20 సంవత్సరాలపాటు విత్ డ్రాయల్ ప్లాన్ ఎంచుకోవాలి. ఈ ప్రకారం పది శాతం రిటర్న్ లెక్కలోకి తీసుకుంటే, మొదటి 20 సంవత్సరాలు, ఆ తర్వాత 20 సంవత్సరాల ప్రకారం లెక్క వేసుకోవాలి. బయటకు విత్ డ్రాయల్ ప్లాన్ ద్వారా నెల నెలా కొంత మొత్తం వెనక్కి తీసుకోవచ్చు. అయితే ఇందులో ఎలా విత్డ్రా చేసుకోవాలి అంటే మొదటి మూడు నెలల తర్వాత లేదా ఆరు నెలల తర్వాత లేదా నెలకు ఒకసారి ఇలా వెనక్కి తీసుకోవచ్చు  ఇందులో చాలామంది ప్రతి నెల వెనక్కి తీసుకుంటారు.

ఇక ఒకవేళ ఇందులో రూ.4,000 చొప్పున ప్రతి నెల పెట్టుబడి పెట్టుకుంటే 20 సంవత్సరాల ఇన్వెస్ట్ చేయాలి. ఆ తర్వాత 20 సంవత్సరాల మొత్తం పెట్టుబడి రూ.9,60,000అవుతుంది. దీనికి 10% రిటర్న్స్ మొత్తం కలిపితే దీని విలువ రూ.30,62,788 రూపాయలు అవుతుంది. అయితే దీనిని నెలవారీగా చూసుకుంటే, నెలకు 25,500 రూపాయలను పొందవచ్చు.


గమనిక : అయితే ఈ మ్యూచువల్ ఫండ్స్ లో ఎవరైతే పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో, అలాంటి వారు  మ్యూచువల్ ఫండ్ వివరాలు పూర్తిగా తెలుసుకున్న తరువాతనే, మీకు అంగీకారం అయితే ఇందులో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: