ఇటీవల రైతులకు కేంద్రం శుభవార్త తెలిపింది. అదేమిటంటే డీఏపీ ఎరువు పై ఇప్పటి వరకు కేవలం 500 రూపాయలు మాత్రమే సబ్సిడీ కింద ఇస్తుండగా, ఇప్పుడు తాజాగా  700 రూపాయల సబ్సిడీని అదనంగా పెంచింది. ఇప్పుడు అలా పెంచడంతో ఏకంగా 1200 రూపాయల సబ్సిడీ రైతులకు వర్తిస్తుంది. ఇక కేంద్రం కేవలం డీఏపీ ఎరువుతో పాటు మరికొన్ని నాన్  యూరియా వ్యవసాయ ఎరువులపై కూడా కొంత సబ్సిడీని కేంద్రం పెంచింది . ఇలా రైతులకు లాభాలు చేకూర్చే సబ్సిడీని పెంపొందించడం వల్ల కేంద్ర ఖజానాపై రూ.14,775 కోట్ల భారం పడింది.
బుధవారం అనగా 2021 జూన్ 16వ తేదీన ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో, సబ్సిడీల పెంపకానికి ఆమోదం తెలిపింది. భారతదేశంలో ముఖ్యంగా రైతులు తమ వ్యవసాయ క్షేత్రంలో  యూరియా తర్వాత ఎక్కువగా డీఏపీ ని అధికంగా ఉపయోగిస్తున్నారు. ఇక అంతకుముందే 145 శాతం సబ్సిడీని డీఏపీ పై పెంచాలని , పోయిన నెలలోనే ప్రధాని అధ్యక్షతన ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ సమావేశంలో నిర్ణయించడం కూడా జరిగింది.
ఇలా సబ్సిడీని పెంచడానికి ముఖ్య కారణం ఏమిటంటే, అంతర్జాతీయంగా పెరుగుతున్న ధరలను దృష్టిలో పెట్టుకుని, రైతులకు కొంచెం వూరట ను అందించాలన్న  ఒక్క ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది. ఇకపోతే ఒక బస్తా డీఏపీ విలువ మార్కెట్లో 2,400 రూపాయలు ఉండగా , ఇప్పుడు ఒక బస్తా రైతులకు కేవలం 1,200 రూపాయలకే లభిస్తోంది . ఇక పోయిన సంవత్సరం ఒక బస్తా డీఏపీ ధర రూ.1,700 ఉండగా కేంద్రం 500 రూపాయలను సబ్సిడీ కింద ఇచ్చేవి ఎరువుల కంపెనీలు. అంతర్జాతీయంగా ధరలు పెరగడంతో డీ ఏ పీ బస్తా కూడా 2,400 రూపాయలకు చేరుకుంది. ఇక రైతు పై భారం పడటంతో ఎరువులు కొనలేని స్థితికి రైతులు చేరుకోవడం వల్ల కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ విషయాలన్నింటిని కేంద్ర రసాయనాల, ఎరువుల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు.



మరింత సమాచారం తెలుసుకోండి: