ఎంప్లాయ్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ..తమ ఖాతాదారులకు శుభవార్త తెలిపింది.. సాధారణంగా ఈపీఎఫ్ఓ నుండి సమాచారాన్ని పొందడం కోసం అలాగే పిఎఫ్ ఖాతా లో ఎంత డబ్బు ఉందో తెలుసుకోవడానికి.. మీరు మీ పిఎఫ్ ఖాతా కు ఇచ్చిన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి 7738299899 నెంబర్ కు ఎస్ఎంఎస్ పంపాల్సి ఉంటుంది. మీరు ఎస్ఎంఎస్ పంపిన అతి తక్కువ సమయంలోనే మీ పిఎఫ్ ఖాతా లో ఎంత డబ్బు ఉందో ఈపీఎఫ్ఓ అధికారులు తెలియజేస్తారు.

ఈపీఎఫ్ఓ లో భాగమైన పీఎఫ్ ఖాతాదారులకు మరో రెండు రోజుల్లో వడ్డీ డబ్బులు వేస్తామని ఈపీఎఫ్ఓ అధికారికంగా ప్రకటించింది. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం నుండి పొందిన వడ్డీ డబ్బులను జూలై నెలలోనే వేయాల్సి ఉండగా, కరోనా మహమ్మారి కారణంగా ప్రాసెస్ కొంతవరకు లేట్ అయిందని చెప్పవచ్చు. ఇక అందుకే ఆగస్టు నెలలో ఖాతాదారులకు తమ వడ్డీ డబ్బులను ఖాతాలలో జమ చేయాలని ఈపీఎఫ్ఓ నిర్ణయించుకుంది. సుమారుగా 6.5 కోట్ల మంది పీఎఫ్ ఖాతాదారులకు ఈ వడ్డీ డబ్బులు మరో రెండు రోజుల్లో జమ చేస్తామని అధికారికంగా ప్రకటించడం జరిగింది.

ఇటీవల ఈపీఎఫ్ ఖాతాదారుడు.. ట్విట్టర్ ద్వారా ఈపీఎఫ్ఓ కు  తమకు రావాల్సిన వడ్డీ డబ్బులు ఎందుకు ఇంకా జమ చేయలేదని ప్రశ్నించగా, అప్పుడు ఈపీఎఫ్ఓ అధికారులు అప్రమత్తం అయ్యారు అని తెలుస్తోంది.అయితే అతను అడిగిన ప్రశ్నలకు సమాధానంగా చెబుతూ.. మరో రెండు రోజుల్లోనే ఈపీఎఫ్ఓ.. పిఎఫ్ ఖాతాదారుల ఖాతాలో డబ్బులు వేస్తామని సూచించింది. అయితే మరో రెండు రోజులే అని చెప్పినప్పటికీ, ఏ సమయంలో ఖచ్చితంగా ఎప్పుడు వేస్తారు.. అనేది మాత్రం ట్వీట్ ద్వారా తెలపలేదు.

మరో రెండు రోజుల  తరువాత మీరు కూడా మీ పీఎఫ్ ఖాతా లో చెక్ చేసుకోవాలి అనుకుంటే , పైన ఇచ్చిన నంబర్ కు ఎస్ఎంఎస్ పంపిస్తే, సులభంగా మీ ఖాతాలో ఉన్న డబ్బులు తెలుసుకోవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: