రైతులకు ఎప్పటికప్పుడు లాభాన్ని చేకూర్చేలా కేంద్రం తన వంతు సహాయం చేస్తున్న విషయం తెలిసిందే. ఇక ఇప్పటికే ఎంతోమంది పంట నష్టపోయి చాలామంది ఆర్థికంగా నష్టపోతున్నారు. ఇకపోతే ఇప్పుడు సరికొత్తగా ఎవరైతే అన్నదాతలు , బ్యాంకులో రుణాలు తీసుకోవాలనుకుంటున్నారో..? అలాంటి వారి కోసమే కేంద్రం కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీం ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఇక ఇందులో భాగంగానే రైతన్నలు మూడు లక్షల రూపాయలు వరకు రుణాన్ని తక్కువ వడ్డీతో పొందవచ్చు. ముఖ్యంగా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ తోపాటు కిసాన్ క్రెడిట్ పథకాన్ని కూడా జత చేయడం జరిగింది.

అంటే ఎవరైతే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీం కింద ప్రతి సంవత్సరం ..ఆరు వేల రూపాయలను మూడు విడతలుగా పొందుతున్నారో , అలాంటి వారికి ఈ క్రెడిట్ కార్డు ద్వారా రుణం పొందే అర్హత లభిస్తుంది.. ఇక కేసీపీ లోన్ కింద  కేవలం 4 శాతం వడ్డీ తోనే మూడు లక్షల రూపాయల వరకు డబ్బును రుణంగా పొందవచ్చు. కేవలం రైతులు మాత్రమే కాకుండా పశుసంవర్ధక రంగాలతో పాటు మత్స్యకారులు కూడా ఈ స్కీం కింద ఋణం పొందవచ్చు. ఒకవేళ ఇప్పటి వరకు ఈ స్కీం కింద ఎవరైతే రుణం తీసుకోకుండా వుంటారో, అలాంటి వారు ఈ స్కీం కింద మూడు లక్షల రూపాయల వరకు రుణాలు పొందవచ్చు..

ఇకపోతే ఎవరైతే లోన్ తీసుకోవాలనుకుంటున్నారో..?  అటువంటివారు సమీపంలో ఉన్న బ్యాంకులకు వెళ్లి కిసాన్ క్రెడిట్ కార్డ్ కోసం అప్లై చేసుకోవచ్చు.. అంతేకాదు పీఎం కిసాన్ వెబ్సైట్ లో కూడా కెసీపీ అప్లికేషన్ ఉంటుంది..కాబట్టి దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.. మీరు రుణం పొందాలి అంటే, కేవలం అడ్రస్ ప్రూఫ్ ,ఆధార్ కార్డ్, ల్యాండ్ డాక్యుమెంట్, మొబైల్ నెంబర్ ,ఫోటో, పాన్ కార్డ్ వంటి డాక్యుమెంట్లను అందిస్తే సరిపోతుంది.. అప్లై చేసిన కేవలం 14 రోజుల లోపే క్రెడిట్ కార్డ్ వస్తుంది.. కాబట్టి  రుణాన్ని  త్వరగానే తీసుకోవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: