తాజాగా ఇన్సూరెన్స్ దిగ్గజ బీమా సంస్థ అయినటువంటి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా విద్యార్థుల కోసం సరికొత్త స్కాలర్ షిప్ స్కీం ను ప్రవేశపెట్టింది.. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు చెందిన ప్రతిభావంతులైన పిల్లల కోసం, ఈ స్కీమ్ వర్తిస్తుంది అని చెప్పవచ్చు.. పదవ తరగతి అలాగే ఇంటర్ ఉత్తీర్ణులై, ఇంటర్ ప్రథమ సంవత్సరం, ద్వితీయ సంవత్సరం, డిప్లమా, ఐటీఐ, పాలిటెక్నిక్ ఏదైనా ఒకేషనల్ కోర్సుల్లో విద్యార్థులు చదువుతున్నట్లు అయితే, వారు కనీసం 60 శాతం మార్కులతో ప్రీవియస్ తరగతులలో ఉత్తీర్ణులై ఉండాలి.. అలాంటి విద్యార్థులు ఈ పథకానికి అర్హులు అవుతారు.. వారి కుటుంబ వార్షిక ఆదాయం లక్ష రూపాయలకు మించి ఉండకూడదు

స్పెషల్ గర్ల్ చైల్డ్ స్కాలర్షిప్ స్కీమ్ కోసం ప్రత్యేకంగా అప్లై చేసుకోవాలనుకునే వారు పదోతరగతిలో కనీసం 60 శాతం పర్సెంటేజ్ తో ఉత్తీర్ణులై ఉండాలి..

ఎంపిక విధానం వచ్చేసరికి.. కుటుంబ ఆర్థిక పరిస్థితి కనీస అర్హత గా పేర్కొన్న పదో తరగతి అలాగే ఇంటర్ మార్కులు చూసి, తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలకు మొదటిగా ఈ పథకం కింద ప్రాధాన్యం లభిస్తోంది. అయితే కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ స్కాలర్షిప్ లభిస్తుంది అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలి.. ముఖ్యంగా దేశ వ్యాప్తంగా ఉన్న ఎల్ఐసి డివిజన్ లలో  సెంటర్ కు 20 మంది విద్యార్థులకు ఈ స్కీమ్ వర్తించడం గమనార్హం.. అంటే పది మంది బాలురకు, పది మంది బాలికలకు ఈ పథకం కింద ప్రతి సంవత్సరం రూ.20 వేల చొప్పున మూడు విడతలుగా 60 వేల రూపాయలను ఎల్ఐసి అందిస్తుంది..

ఈ డబ్బులను నేరుగా ఎల్ఐసి.. విద్యార్థుల ఖాతాల్లో జమ చేయడం గమనార్హం.. అలాగే  హాస్టల్‌లో చదివే విద్యార్థులకు నెలకు రూ.1000, డేస్కాలర్స్‌కు నెలకు రూ.500 ఇస్తారు.

వెబ్‌సైట్‌: https://scholarships.gov.in అనే వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.



మరింత సమాచారం తెలుసుకోండి: