సాధారణంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ఎన్నో పోస్ట్ ఆఫీసులు, బ్యాంక్ లు కూడా ప్రతి ఒక్కరికి డబ్బు ఆదా చేసుకోవడం కోసం , ఎప్పటికప్పుడు సరికొత్త పథకాలను అందుబాటులోకి తీసుకు వస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు సీనియర్ సిటిజన్స్ కోసం, బాలికల కోసం, వృద్ధుల కోసం, మహిళల కోసం ఇలా రకరకాలుగా క్యాటగిరి ప్రకారం సరికొత్త పథకాలను ప్రవేశ పెడుతున్న విషయం తెలిసిందే . కానీ ఇప్పుడు సరికొత్తగా భార్య భర్తల కోసం అదిరిపోయే ప్రత్యేక స్కీమ్స్ ను ప్రవేశపెట్టనుంది కేంద్ర ప్రభుత్వం.. ఎవరైతే పెన్షన్ స్కీమ్ లో చేరాలని అనుకుంటారో అలాంటి వారిలో ముఖ్యంగా భార్యాభర్తల కోసం కేంద్ర ప్రభుత్వం ఒక ప్రత్యేకమైన పెన్షన్ స్కీమ్ ను అందుబాటులోకి తీసుకువచ్చింది.

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పెన్షన్ స్కీమ్ పేరు అటల్ పెన్షన్  యోజన స్కీమ్.. ఈ స్కీం లో చేరడం వల్ల భార్యభర్తలిద్దరూ.. నెలకు పదివేల రూపాయల వరకు పెన్షన్ కింద డబ్బులు పొందవచ్చు.. అందుకే ఈ స్కీమ్‌లో ప్రతి సంవత్సరం  చేరుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. 2020-21 ఆర్థిక సంవత్సరంలోనే మొత్తం 79 లక్షల మంది భార్యా భర్తలు ఈ అటల్ పెన్షన్ యోజన పథకం లో చేరారు. ఇక ఇప్పటికే ఈ పెన్షన్ స్కీమ్‌లో చేరినవారి సంఖ్య ఏకంగా 3 కోట్లు దాటడం విశేషం.


కేంద్ర ప్రభుత్వం 2015 లో ఈ పథకాన్ని  ప్రారంభించిన విషయం తెలిసిందే. ముఖ్యంగా అసంఘటిత రంగంలో ఉన్నవారికి, ఈ పెన్షన్ ప్రయోజనాలు అందించేందుకు ప్రారంభించిన పథకమే ఇది.. ఇక అటల్ పెన్షన్ యోజన స్కీమ్‌లో 18 యేళ్ల నుంచి 40 యేళ్ల వయస్సు ఉన్నవారు ఎవరైనా చేరవచ్చు. ఇక ఈ స్కీమ్ ద్వారా నెలకు కనిష్టంగా రూ.1,000 నుంచి గరిష్టంగా రూ.5,000 వరకు పెన్షన్ వస్తుంది.. ఇక  18 ఏళ్ల వయస్సు ఉన్న  వ్యక్తి నెలకు కనీసం రూ.1,000 పెన్షన్ పొందాలంటే.. 18 సంవత్సరాల నుండి 60 సంవత్సరాలు వచ్చే వరకు నెలకు రూ.42 చొప్పున జమ చేయాలి. ఇక భార్యాభర్తలు ఇద్దరూ ఈ పథకం లో చేరడం వల్ల , నెలకు రెండు వేల నుంచి పదివేల వరకు పెన్షన్ పొందవచ్చు.


మరింత సమాచారం తెలుసుకోండి: