ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎట్టకేలకు అగ్రకులాల వాళ్లపై కనికరం చూపించాడు అని తెలుస్తోంది. అంటే ఇప్పటి వరకు అన్ని కులాల మహిళలకు సహాయం అందించిన జగన్ ప్రభుత్వం అగ్ర కులాల మహిళలను మాత్రం పక్కన పెట్టిన విషయం తెలిసిందే. కానీ ఇప్పుడు ఈబీసీ నేస్తం అనే పథకం ద్వారా అర్హులైన అభ్యర్థులు, ఈ పథకంలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలని అధికారులు స్పష్టం చేశారు.

అగ్రకుల మహిళలకు మాత్రమే ఈ పథకం వర్తిస్తుంది.. కాబట్టి ఇందులో ఏడాదికి లబ్ధిదారులకు 15 వేల రూపాయల చొప్పున ఏకంగా మూడు సంవత్సరాల పాటు మొత్తం 45 వేల రూపాయలను అగ్రకుల మహిళలకు ఆర్థిక సాయం గా అందజేస్తామని ప్రకటించడం జరిగింది..అంటే ఇందులో మహిళల వయస్సు 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల లోపు కలిగిన వారే ఉండాలి. అలాంటి వారికి ఈబీసీ పథకం కింద డబ్బులు పొందే అవకాశం ఉంటుంది.


2021 - 2022 బడ్జెట్ ప్రకారం ప్రభుత్వం సంవత్సరానికి రూ.670 కోట్లు చొప్పున మూడు సంవత్సరాలకు గాను 2011 కోట్ల రూపాయలను కేటాయించింది... ఎవరైతే వైయస్సార్ చేయూత, కాపు నేస్తం కింద లబ్ధిదారులతో పాటు ఎస్టీ, ఎస్సీ, బీసీ మైనార్టీ మహిళలు ఈ పథకం కింద అర్హులు కారు.. ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందే మహిళలకు అందించిన విషయం తెలిసిందే. ఇప్పుడు కేవలం ఈబిసి అగ్రకుల మహిళలకు మాత్రం ఈ పథకం వర్తిస్తుంది. ఈబిసి అగ్రకుల మహిళలు ఈ పథకం కింద అర్హులు కావాలి అంటే పల్లెల్లో అయితే నెల ఆదాయం పది వేలు రూపాయలు , పట్టణ ప్రాంతాల్లో అయితే రూ.12,000 మించకూడదు.

మెట్ట భూమి 10 ఎకరాల కన్నా తక్కువ ఉండి, పల్లపు భూమి మూడు ఎకరాల కంటే తక్కువ ఉండాలి.. ఇక సెప్టెంబర్ 29 2021 నాటికి మహిళ వయసు 45 సంవత్సరాల కంటే ఎక్కువ, 60 సంవత్సరాల కంటే తక్కువ ఉన్న వాళ్లకి ఈ పథకం వర్తిస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: