ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏం చేసినా మన మంచికే చేస్తుందనే విషయాన్ని ప్రజలు భావిస్తున్నట్టు వినిపిస్తోంది. ఎందుకంటే మోడీ సర్కార్ ప్రతి ఒక్కరిని దృష్టిలో పెట్టుకొని తాజాగా సరికొత్తగా బంపర్ ఆఫర్ ప్రకటించారు. అదేమిటంటే ఎటువంటి సంబంధిత డాక్యుమెంట్స్ లేకుండానే ఏకంగా 1.65 లక్షల రూపాయలను లోన్ కింద పొందే వెసలుబాటు కల్పించడం గమనార్హం. రైతుల ఆదాయాన్ని పెంపొందించుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం సరికొత్తగా పశు కిసాన్ క్రెడిట్ కార్డును ప్రవేశపెట్టింది.ఈ పశు కిసాన్ క్రెడిట్ కార్డు నియమ నిబంధనలు మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కిసాన్ క్రెడిట్ కార్డ్ పథకంను పోలి ఉంటాయి.


ఎవరైతే ఈ పశు కిసాన్ క్రెడిట్ కార్డు అప్లై చేస్తారో అలాంటి వారు ఈ పథకం కింద ఆవులు, గొర్రెలు, గేదెలు, మేకలు, కోళ్ళు ఇలా జీవ పెంపకానికి గరిష్టంగా రూ.3 లక్షల వరకు అందుబాటులో ఉంటుంది.అయితే  ఇందులో మీరు  రూ.1.60 లక్షల వరకు ఎలాంటి హామీ ఇవ్వాల్సిన అవసరం లేకుండా లోన్ పొందవచ్చు. ఇక ఈ పథకం లో లోన్ పొందాడానికి  అర్హులైన దరఖాస్తు దారులందరికీ పశు కిసాన్ క్రెడిట్ కార్డ్ స్కీమ్ ప్రయోజనం ఉంటుందని బ్యాంకర్స్ కమిటీ ప్రభుత్వానికి కూడా హామీ ఇచ్చింది. ఇక ఈ పథకం గురించి సమాచారం కోసం బ్యాంకులు శిబిరాలు కూడా  నిర్వహిస్తామని వెల్లడించారు.. ఈ మేరకు బ్యాంక్ అధికారులు.. పశువైద్యులు.. పశువైద్యశాలల్లో ప్రత్యేక హోర్డింగ్‌లు పెట్టి పథకం గురించి సమాచారం అందించాలి అని ఉత్తర్వులు కూడా జారీ చేసారు..


ముఖ్యంగా  రాష్ట్రంలో దాదాపు 16 లక్షల కుటుంబాలు పాడి పశువులను కలిగి ఉన్నాయని సమాచారం. సాధారణంగా ఎవరైనా లోన్ కి అప్లై చేయాలి అంటే బ్యాంకులు ఏడు శాతం వడ్డీని విధిస్తాయి కానీ ఫస్ట్ కిసాన్ క్రెడిట్ కార్డు కింద కేవలం 4 శాతం వడ్డీతో మీరు పొందవచ్చు. పూర్తి వివరాలకు దగ్గర్లో ఉన్న బ్యాంకులకు వెళ్లి తెలుసుకుంటే సరిపోతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: