సాధారణంగా కొత్త సంవత్సరం ఆర్థికంగా మెరుగుపడటానికి ప్రతి ఒక్కరు ఉన్న ఉద్యోగం కంటే ఏదైనా కొత్త వ్యాపారం మొదలు పెట్టాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అంతే కాదు ఆ వ్యాపారం తక్కువ పెట్టుబడి ఉండాలి ఎక్కువ లాభార్జన ఉండాలని కూడా ఆలోచిస్తూ ఉండటం గమనార్హం. ప్రతి ఒక్కరు ఈ కొత్త సంవత్సరం తమకు నచ్చిన రిజల్యూషన్స్ తీసుకున్నట్టుగానే చాలామంది వ్యక్తిగతంగా, ఆర్థికంగా మెరుగుపడటానికి కొన్ని లక్ష్యాలను పెట్టుకుంటూ ఉంటారు. ఇకపోతే ఈ కొత్త సంవత్సరం కొత్త బిజినెస్ మొదలు పెట్టాలని ఎవరైతే ఆలోచిస్తున్నారో.. అలాంటి వాళ్ళు ఇప్పుడు చెప్పబోయే బిజినెస్ ద్వారా ఏకంగా 40 వేల రూపాయల వరకు ఆదా చేసుకోవచ్చు.. బిజినెస్ ఏమిటో ఇప్పుడు మనం ఒకసారి చదివి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..


ఇప్పుడు చెప్పబోయే చిన్న బిజినెస్ ఐడియా తో 22 వేల రూపాయల పెట్టుబడితో ప్రతినెల 40 వేల రూపాయల కంటే ఎక్కువగానే సంపాదించవచ్చు. కార్ వాషింగ్ బిజినెస్ గురించి మీరు వినే ఉంటారు. రోడ్డు పక్క చేసే చిన్న వ్యాపారంలా  మీకు అనిపించినా కానీ దీనివల్ల చాలా మంది లబ్ధి పొందుతున్నారు అనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. ఒకవేళ మీకు ఈ వ్యాపారం నచ్చి.. అదృష్టం కూడా కలిసి వస్తే ఒక మెకానిక్ ను  పెట్టుకొని కార్ వాషింగ్ తో పాటు కార్ రిపేర్  కూడా చేసి మంచి ఆదాయాన్ని పొందవచ్చు. అయితే ఈ ఐడియా అనేది పాతదే అయినప్పటికీ ఈ కొత్త ఏడాది కొత్తగా ప్రారంభిస్తే తప్పకుండా లాభం పొందవచ్చు అని ఇప్పటికే కార్ వాషింగ్ బిజినెస్ లో సక్సెస్ అయిన వారు చెబుతున్నారు.


అయితే ఈ బిజినెస్ ఎలా ప్రారంభించాలి అనే విషయానికి వస్తే ..మార్కెట్లో 12 వేల రూపాయలు మొదలుకుని లక్ష రూపాయలు విలువ చేసే కార్ క్లీనింగ్ ప్రొఫెషనల్ మిషన్లు అందుబాటులో ఉన్నాయి. అయితే మీరు కొత్తగా వ్యాపారం మొదలు పెడుతున్నారు.. కాబట్టి ఉదాహరణకు 14 వేల రూపాయలతో కార్ క్లీనింగ్ మిషన్ ను కొనుగోలు చేశారని అనుకుందాం..ఈ ధరకు మీరు రెండు హార్స్ పవర్ కలిగిన యంత్రాలను పొందవచ్చు. తొమ్మిది వేల రూపాయల విలువ గల వ్యాక్యూమ్ క్లీనర్ ను కొనుగోలు చేయాలి. సోప్ , షాంపు, సర్ఫ్, టైర్ పాలిష్, డాష్ బోర్డ్ పాలిష్  లాంటివి కొనుగోలు చేయాలి. రద్దీ లేని ప్రదేశంలో ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా మీరు ఈ బిజినెస్ మొదలుపెడితే ఒక్కొక్క కార్ వాషింగ్ కి 200  రూపాయలు చొప్పున తీసుకున్నా.. ఎంత లేదన్నా నెలకు 40 వేల రూపాయలు ఈజీగా సంపాదించవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: