నూతన సంవత్సరం మొదలైంది.. ఇక కొత్త సంవత్సరం ప్రారంభంలో మనం తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేలా ఉండాలి అని కొంతమంది ఆర్థిక నిపుణులు తెలియజేస్తున్నారు.. ఇకపోతే మరికొంతమంది ఇప్పటికే కొన్ని ఆర్థిక ప్రణాళికను కూడా సిద్ధం చేసుకోవడం గమనార్హం. ఇకపోతే ఎంతో మంది తల్లిదండ్రులు తమ పిల్లల చదువుల కోసం ఆడ పిల్లల బంగారు భవిష్యత్తు కోసం కొత్త ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు.. ముఖ్యంగా ఎవరైతే ఆడపిల్లలను కలిగి ఉంటారో అలాంటి తల్లిదండ్రులు వారి బంగారు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తపడితే మంచిది అని చెప్పవచ్చు..


ప్రస్తుతం ఎల్ఐసి ఆఫర్ చేస్తున్న కన్యాదాన్ పాలసీలో డబ్బులు ఇన్వెష్ట్  చేయడం వల్ల ఆడపిల్లల పెళ్లి విషయంలో ఎటువంటి ఇబ్బంది కలగదు. అయితే ఇందులో మీరు కేవలం ప్రతిరోజు 130 రూపాయలు పొదుపు చేయడం వల్ల నెలకు 3,900 రూపాయలు మీ పాలసీలు పొదుపు చేసే అవకాశం ఉంటుంది. అయితే ఇలా ప్రతినెలా డిపాజిట్ చేస్తూ వెళ్లడం వల్ల ఒకేసారి రూ. 27 లక్షల వరకు పొందవచ్చు. ఇకపోతే ఈ పాలసీలో ఇన్వెస్ట్ చేసిన ప్రతి రూపాయి కూడా పన్ను మినహాయింపు ప్రయోజనాలను పొందే వెసులుబాటును కల్పించింది. అంతేకాదు ఏకంగా లక్షన్నర రూపాయల పన్ను మినహాయింపు బెనిఫిట్స్ లభించడం అంటే అంత ఆషామాషీ కాదు అనే చెప్పాలి.


ఈ పాలసీలో చేరాలనుకునే వారు ముందుగా అమ్మాయి యొక్క ఆధార్ కార్డు, గుర్తింపు కార్డు ,ఆదాయపు సర్టిఫికెట్ ,పాస్ పోర్ట్ సైజు ఫోటో ,అడ్రస్ ప్రూఫ్, మొదటి ప్రీమియం చెక్ ,అమ్మాయి సిగ్నేచర్ , బర్త్ సర్టిఫికెట్ తో కలిపి అప్లికేషన్ ఫామ్ సమర్పించడం వల్ల ఈ పాలసీ బెన్ఫిట్స్ ని మీరు పొందే అవకాశం ఉంటుంది. 25 సంవత్సరాలకు పాలసీ తీసుకున్నట్లయితే 22 సంవత్సరాలకు ప్రీమియం చెల్లించాలి. పాలసీ తీసుకున్న వాళ్లకు 25 సంవత్సరాలు వచ్చిన తర్వాత 27 లక్షల రూపాయలు లభిస్తాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: