స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో లేదా పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఇండియాలో లేదా ఏ ఇతర బ్యాంకుల్లో అయినా సరే మీకు ఒక అకౌంట్ ఉందా.. ఒకవేళ ఉంటే మీకు మాత్రం ఒక చక్కటి గుడ్ న్యూస్ అని చెప్పవచ్చు.. ఎందుకంటే ఇప్పుడు చెప్పబోయే వార్త వింటే నిజంగా మీరు ఆశ్చర్యం తో పాటు ఆనందం వ్యక్తం చేస్తారు.జన్ ధన్ ఖాతా గనుక మీకు ఉన్నట్లయితే రెండు లక్షల రూపాయల వరకు మంచి ప్రయోజనాలు కలుగుతాయి. రెండు లక్షలు మాత్రమే కాదు ఏకంగా నాలుగు లక్షల రూపాయల వరకు బెనిఫిట్ పొందే అవకాశాన్ని తాజాగా కేంద్ర ప్రభుత్వం కల్పించడం గమనార్హం.


ఇకపోతే మోదీ సర్కార్ తీసుకొచ్చిన ఈ జన్ ధన్ ఖాతా కింద కస్టమర్లు ఎవరైనా సరే బ్యాంకుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ జన్ ధన్ పథకంలో ఖాతా తెరవవచ్చు.. ఇక మోదీ సర్కారు ప్రవేశపెట్టిన ఈ పథకం లో చేరడం వల్ల బ్యాంకు వారు మీకు రూపే డెబిట్ కార్డును కూడా అందించడం జరుగుతుంది. రూపే కార్డు కలిగిన వారు ఉచితంగా లక్షల రూపాయల వరకు ప్రమాద బీమా ను పొందడం గమనార్హం.. ఈ కార్డు కలిగిన వారు పదివేల రూపాయల వరకు ఓవర్డ్రాఫ్ట్ ఫెసిలిటీ కింద పొందవచ్చు. ఇక మీరు డబ్బులు తిరిగి కట్టేటప్పుడు ఎటువంటి వడ్డీ లేకుండా బ్యాంకులలో జామ చేయవచ్చు..


ఇకపోతే మరే ఇతర బ్యాంకుల లో కూడా ఎటువంటి ఖాతా తెరవని వారికి మాత్రమే ఈ జన్ ధన్ ఖాతా ఓపెన్ చేసే అధికారం ఉంటుంది. ఈ జన్ ధన్  పథకం లో అకౌంట్ కలిగిన వారికి మినిమమ్ బ్యాలెన్స్ కూడా ఉండాల్సిన అవసరం ఏమీ లేదు కానీ ప్రభుత్వం అందించే అన్ని పథకాలు కూడా నేరుగా మీ అకౌంట్లో క్రెడిట్ అవడం గమనార్హం. ఇప్పటికే ఎంతో మంది మహిళలు కూడా రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయాన్ని కూడా ఈ ఖాతాలోనే పొందుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: