ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ తమ ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవడానికి పోస్టాఫీసులలో ఎన్నో పథకాలు అందుబాటులో ఉన్నాయి. ఇక పలు రకాల స్కీం లలో ఇన్వెస్ట్ చేయడం వలన నెలనెలా ఇంక పొందే అవకాశాలు కూడా చాలా ఉంటాయి. ప్రతి నెల కచ్చితంగా మీరు ఆదాయం పొందాలంటే మాత్రం పోస్ట్ ఆఫీస్ తీసుకొచ్చిన మంత్లీ ఇన్కమ్ స్కీం లో ఖాతా తెరవడం వల్ల మరిన్ని లాభాలు సొంతం చేసుకోవచ్చు. ఇక ఈ పథకం లో మీరు ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలి. పెట్టుబడిగా పెట్టిన డబ్బుకు ఏ మాత్రం రిస్క్ ఉండదు. పైగా రెట్టింపు స్థాయిలో ఆదాయం లభిస్తుంది.


ఇక భార్య భర్తలు అయినా ఈ ఖాతాలో చేరవచ్చు. సింగిల్ గా కూడా ఈ ఖాతాలో పొదుపు చేసుకునే అవకాశం ఉంది. ఇకపోతే కనిష్టంగా 1000 రూపాయలు పెట్టుబడిగా పెట్టాలి అనుకుంటే ఈ స్కీమ్లో సింగిల్ అకౌంట్ చాలా మంచిది.  ఇందులో ఒకేసారి 4.5 లక్షల రూపాయలను మీరు ఇన్వెష్ట్ చేస్తే రూ. 2475 రూపాయలను పెన్షన్ కింద పొందవచ్చు. ఒకవేళ జాయింట్ ఖాతా కనుక మీరు ఓపెన్ చేస్తే మొత్తం 9 లక్షల రూపాయలు జమ చేయాల్సి ఉంటుంది. ఇక భార్య భర్త ఇద్దరూ కలిపి మొత్తం తొమ్మిది లక్షల రూపాయలు మీరు ఈ ఖాతా లో ఇన్వెస్ట్ చేస్తే ప్రతి నెల 4,950 రూపాయలను పెన్షన్ కింద పొందవచ్చు.


ఇద్దరూ కలిసి సంవత్సరానికి 59,400 రూపాయలు పొందే అవకాశం ఉంటుంది. ఇలా మొత్తంగా చూసుకుంటే నెలకు 5000 రూపాయలు వచ్చినట్లే అవుతుంది. ప్రస్తుతం ఈ పథకంలో మీకు 6.6 శాతం వడ్డీ కూడా లభిస్తోంది. ఖాతా తెరిచిన తేదీ నుంచి ఒక నెల పూర్తయిన తర్వాత మీ మెచ్యూరిటీ సమయం ముగిసే వరకు వడ్డీ చెల్లించడం జరుగుతుంది. ఇక మీ సమీపంలో ఉన్న పోస్టాఫీసుకు వెళ్లి పథకం యొక్క పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: