4/19/2013 7:11:00 AM
SRIRAMBHATLA SHASHIKANTH
గుండే జారి... అదిరిపోయిందే..!
గుండే జారి గల్లంతయ్యిందే అన్న టైటిల్ కు పూర్తి న్యాయం జరిగింది. సినిమా స్లో గా మొదలై అదే క్రమంలో హీట్ ను పెంచుతూ చివరకు ఏం జరుగుతుందో అన్న హైటెన్షన్ క్రియేట్ చేసారు.
ప్రేక్షకులను ఈటెన్షన్ నుంచి దూరం చేస్తూ నవ్వుల జల్లులు కురిపించి ఎవరూ ఊహించని విధంగా క్లయిమాక్స్ ను తెరకెక్కించి సినిమాను సుఖాంతంగా ముగించి చూసిన ప్రతి ఒక్కరు ‘ గుండే జారి అదిరిపోయిందే ’ అనేలా సినిమాను తెరకెక్కించారు.
గజిబిజి పాత్రల గోల లేకుండా, కథకు అవసరమైన సీన్లనే తెరకెక్కించి ఎక్కడా బోర్ అనకుండా, కుటుంబం అంతా కలిసి చూసి ఆనందించేలా అసభ్యకర దృష్యాలు లేకుండా, అదిరిపోయే ఫైటింగ్ ల రొద పెట్టకుండా కూల్ గా తీసి అందరి చేత సింప్లీ సూపర్బ్ అనిపించేలా ఉంది.
హీరో ప్రేమించేది ఒకరిని, నిజంగా ప్రేమిస్థుంది మరొకరిని, అలాగే హీరో ఇన్ ప్రేమించేది హీరోనే, కాని అతని పై పగతీసుకోవడానికి రంగంలోకి దిగి చివరి వరకు ఉత్కంఠ ను కలిగించి చివర్లో హీరో హీరోఇన్లు ఎలా కలుసుకుంటారు అన్న హైఫీవర్ క్రియేట్ చేసి అదరగొట్టి ఇండస్ట్రీకి కొత్త దర్శకుడే అయినా సినివర్గాలు విస్తుపోయేలా చేసారు విజయ్ కుమార్.
హీరో,హీరోఇన్ నితిన్, నిత్యామీనన్ లతో సహా ప్రతిపాత్ర జీవం పోసింది. చిన్నసినిమా అని అందరు అనుకుంటున్నా, అదికూడా పెద్ద విజయం సాధిస్తుంది అని నిరూపించిన సినిమాల్లో గుండే జారి గల్లంతయ్యిందే నిలచిపోతుంది.