8/31/2012 4:12:00 AM
Prasad
బి ఎన్ రెడ్డి అభిప్రాయాన్ని తలకింద్రులు చేసిన ఆరాధన
అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, జగయ్య ప్రధాన పాత్రలో నటించిన ఆరాధన సినిమా మంచి విజయాన్ని సాధించింది. అయితే ముందుగా ఈ సినిమా ను ప్రేక్షకులు ఆదరించరని బి.ఎన్.రెడ్డి అంచనా వేశారట.
ఆరాధన సినిమాను సాగరిక అనే కన్నడ సినిమా ఆధారంగా వి.బి.రాజేంద్ర ప్రసాద్ నిర్మించారు. సినిమా షూటింగ్ మద్యలో ఉండగా ఈ ఆరాధన సినిమాను బి.ఎన్.రెడ్డికు రాజేంద్ర ప్రసాద్ చూపించారు. అప్పటికే రొమాంటిక్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అక్కినేనిని గుడ్డివాడిగా ప్రేక్షకులు చూడలేరని సినిమాను ప్రేక్షకులు ఆదరించరని బిఎన్ రెడ్డి తన అభిప్రాయాన్ని చెప్పారు.
దీంతో రాజేంద్ర ప్రసాద్ కంగారు పడినా చివరికి షూటింగ్ ను పూర్తి చేసి విడుదల చేశారు. బిఎన్ రెడ్డి అభిప్రాయాన్ని తల కిందులు చేస్తూ ఆరాధన సినిమా సూపర్ హిట్ అయింది.