తమిళంలో వన్ ఆఫ్ ది టాప్ హీరో "సూర్య". శివ పుత్రుడు, గజిని, కాక్క కాక్క, వీడొక్కడే, యముడు వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ని సొంతం చేసుకొని తమిళ ఇండస్ట్రీలోనే కాకుండా ఇటు తెలుగులోను మార్కెట్ ను పెంచుకున్నాడు. ఇప్పటికే బెస్ట్ యాక్టర్ గా నంది అవార్డ్ లను, ఫిల్మ్ ఫేర్ అవార్డ్ లను సొంతం చేసుకున్న సూర్య హీరోగా అగ్ర స్థానంలో ఉన్నాడు. 


సౌత్ ఇండియలో ప్రస్తుతం వున్న యంగ్ హిరోలో అధికంగా రెమ్యునిరెషన్ తీసుకుంటున్న "యంగ్ హిరో సూర్య" కావడం విశేషం. అంతేకాదు సౌత్ ఇండియలో అత్యధిక ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న యంగ్ హీరోలలో సూర్య నంబర్ 1 పొజిషన్ లో ఉన్నాడని సర్వేలు చెబుతున్నాయి. సౌత్ ఇండియలో అత్యధిక క్రేజ్ వున్న యంగ్ హీరో కూడా సూర్య నే. ఇంత క్రేజ్ , ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ కథను మాత్రం తను ఒక్కరే వినరట. ఒకవేళ సూర్య విన్నప్పటికి ఫైనల్ చేసేది మాత్రం K.E.జ్ఞానవేల్ రాజా  అని ఇండస్ట్రీ టాక్.


K.E.జ్ఞానవేల్ రాజా తమిళ ఫిల్మ్ ఇండస్ట్రీలో అగ్ర నిర్మాత..స్టూడియో గ్రీన్ అధినేత, డిస్ట్రిబ్యూటర్. ఇతను కేవలం సూర్య, కార్తీ సినిమాలనే నిర్మించడం, డిస్ట్రిబ్యూట్ చేయడం చేస్తుంటాడు. K.E.జ్ఞానవేల్ రాజా కు మంచి అభిరుచి గల నిర్మాత అని పేరు కూడా ఉండటం విశేషం. ఇక ఇతను సూర్య తో ఎక్కువగా సినిమాలను నిర్మిస్తే, దాదాపు అన్నీ సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకున్నాయి. అందుకే సూర్య తో తీయబోయే ఏ సినిమానైనా సూర్య తర్వాత జ్ఞానవేల్ రాజా కథ విని ఫైనల్ చేస్తాడట. ఇది సూర్య కి ఒకరకంగా ప్లస్సే నని కూడా చాలా మంది అభిప్రాయం. అలాంటి అగ్ర నిర్మాత కథ విని ఫైనల్ చేశాడంటే మరి సూర్య లిస్ట్ లో భారీ నిట్ పడాల్సిందే.    


మరింత సమాచారం తెలుసుకోండి: