టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండతో పెళ్లి చూపులు అనే సినిమాను తెరకెక్కించిన ద‌ర్శ‌కుడు త‌రుణ్ భాస్క‌ర్ ఓవ‌ర్‌నైట్‌లో స్టార్ డైరెక్ట‌ర్ అయిపోయాడు. పెళ్లి చూపులు సినిమాను భాస్క‌ర్ తెర‌కెక్కించిన తీరుకు టాలీవుడ్ స్టార్ హీరోలు సైతం ఫిదా అయిపోయారు. తెలంగాణ‌లోని వ‌రంగ‌ల్ జిల్లాకు చెందిన త‌రుణ్ భాస్క‌ర్‌కు ఈ సినిమా త‌ర్వాత చాలా అవ‌కాశాలు వ‌చ్చాయి.


త‌రుణ్ మాత్రం త‌న రెండో సినిమాగా అంతా కొత్త వాళ్ళతో ‘ఈనగరానికి ఏమైంది’ అనే సినిమా తెరకెక్కించాడు. అయితే ఈ సినిమాకు విమ‌ర్శ‌కుల నుంచి మంచి ప్ర‌శంస‌లు వ‌చ్చినా క‌మ‌ర్షియ‌ల్‌గా మాత్రం అనుకున్న స‌క్సెస్ సాధించ‌లేదు. ఇక త‌రుణ్ భాస్క‌ర్ కొద్ది రోజులుగా హీరోగా మారుతున్న‌ట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ విష‌యాన్ని ఆయ‌న సైతం ఒప్పుకున్నాడు. త‌న తొలి సినిమాలో త‌రుణ్ రొమాన్స్ చేసే హీరోయిన్ కూడా ఫిక్స్ అయ్యింది.


తన తొలి సినిమా హీరో విజ‌య్ దేవ‌ర‌కొండ‌నే ఇప్పుడు త‌రుణ్‌ను హీరో చేస్తున్నాడు. విజయ్ దేవరకొండ ప్రొడక్షన్ లో తరుణ్ భాస్కర్ హీరోగా పరిచయం కానున్నాడు. ఈ సినిమాలో కోలీవుడ్ బ్యూటీ వాణి భోజన్ హీరోయిన్‌గా ఎంపికైంది. త‌రుణ్‌, వాణి క‌లిసిన స్టిల్ కూడా బ‌య‌ట‌కు వ‌చ్చేసింది. కోలీవుడ్‌లో న‌టించిన ఆమెకు తెలుగులో ఇదే తొలి సినిమా. ఇక ఈ సినిమా గురించి మిగిలిన వివ‌రాలు త్వ‌ర‌లోనే బ‌య‌ట‌కు రానున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: